అక్రమాలకు తావు లేకుండా ఈ-నామ్

Sun,August 18, 2019 03:32 AM

మహబూబాబాద్ నమస్తే తెలంగాణ, ఆగష్టు 17 : మర్కెటింగ్ నిర్వహణలో పారదర్శకతతో పాటు ఆక్రమాలకు తావు లేకుండా ఈ-నామ్ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ కేబినెట్ సెక్రటరీ ప్రదీప్‌కుమార్ సీన్హా పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఎక్సలెన్స్ అవార్డును పురస్కరించుకొని శనివారం ఆయన న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కేసముద్రం మార్కెట్లో ఈ-నామ్ అమలుపై కలెక్టర్ సీహెచ్. శివలింగయ్యతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ-నామ్ అమలవుతున్న మార్కెట్లో ఉత్తమమైన మార్కెట్‌గా ఉన్నట్లు తెలిపారు. కేసముద్రం మార్కెట్లో ఈ-నామ్ అమలు ప్రత్యేకతలపై కలెక్టర్‌ని అడిగి తెలుసుకున్నారు.

ఈ-నామ్ అమలుకు ముందు అమలు తర్వాత రైతులకు కలిగిన లాభం గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ సీహెచ్. శివలింగయ్య మాట్లాడుతూ..ఈ-నామ్ ద్వారా కేసముద్రం మార్కెట్‌లో మొత్తం క్రయ, విక్రయాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ-నామ్ మార్కెటింగ్‌లో ఇప్పటి వరకు 94వేల మంది రైతులు నమోదు చేసుకున్నారన్నారు. దళారుల వ్యవస్థ లేకుండా నేరుగా రైతులకు ఈ విధానం వల్ల లాభం చేకూరుతుందన్నారు. ఎలక్ట్రానిక్, డిజిటలైజ్ తూకం కాంటాలు మార్కెట్లో ఉపయోగిస్తున్నాట్లు తెలిపారు. రైతులకు ఆన్‌లైన్‌లోనే ఈ పర్మిట్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మహబూబాబాద్ మార్కెటింగ్ శాఖ అడిషనల్ డైరెక్టర్ లక్ష్మణుడు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles