మళ్లీ కరుణించిన వరణుడు

Sun,August 18, 2019 03:32 AM

మహబుబాబాద్,నమస్తే తెలంగాణ,ఆగస్టు17 : మానుకోట పట్టణంలో వరణుడు మళ్లీ కరుణించడంతో మోస్తారు వర్షం కురిసింది. వారం రోజులుగా వర్షం లేక రైతులు కొంత ఇబ్బంది ఎదుర్కొన్నారు. శనివారం కురిసిన వర్షంతో పత్తి, కంది,వరి నాట్లకు మేలు కలుగుతుందని రైతులు పేర్కొన్నారు. సుమారు గంటపాటు కురిసిన వర్షానికి చెరువుల్లోకి నీరుచేరింది.వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం జిల్లాలోని అక్కడ చిరు జల్లులు కురిసాయి. జిల్లా వ్యాప్తంగా 113.4 మిల్లీ మీటర్లు వర్షం కురియగా సగటున బయ్యారం 32.4, గార్ల 2.6, డోర్నకల్ 19.8, కురవి 4.0, కేసముద్రం 3.6, మహబూబాబాద్ 46.8, మరిపెడ 4.2మి. మీగా నమోదైంది. మహబూబాబాద్ పట్టణంలో 45 నిమిషాల్ల్లో 46.8 మిల్లీమీటర్ల వర్షంకురిసింది. దీంతో రైతులు వారి, వారి వ్యవసాయ పనుల్లో బిజీకానున్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles