ఈ-పర్మిట్ విధానంపై జిల్లా స్థాయి అవగాహన

Sat,August 17, 2019 03:10 AM

-పాల్గొన్న మార్కెటింగ్ శాఖ అదనపు డైరెక్టర్ లక్ష్మణుడు
కేసముద్రం రూరల్, ఆగస్టు16 : మార్కెట్‌లో కొనుగోలు చేసే ప్రతీ వ్యాపారి ఈ-పర్మిట్ విధానాంపై అవగాహన కలిగి ఉండాలని మార్కెటింగ్ శాఖ అదనపు డైరెక్టర్ ఆర్ లక్ష్మణుడు అన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఈ-సర్వీసెస్‌లో భాగంగా ఈ-పర్మిట్ విధానంపై జిల్లా స్థాయిలోని మూడు వ్యవసాయ మార్కెట్‌లకు చెందిన వ్యాపారస్తులు, ఇతర లైసెన్స్‌దారులు, సిబ్బందితో అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా లక్ష్మణుడు మాట్లాడుతూ మార్కెట్‌లోనే కాకుండా మిల్లులు, రైతుల వద్ద కొనుగోలు చేసే వ్యాపారులు ఆన్‌లైన్‌లో రైతుల వివరాలను పొం దుపర్చాలని సూచించారు. అదేవిధంగా ఇతర పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన కంపెనీ పేరుతో పాటు రైతుల పేరు, మార్కెట్ పేరును తప్పని సరిగా ఈ-పర్మిట్‌లో పొందు పర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీడీఎం అజ్మీర రాజు, డీఎంవో సురేఖ, తొర్రూరు, మహబూబాబాద్, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కార్యదర్శులు చందర్‌రావు, వేణుగోపాల్‌రెడ్డి, మల్లేశం, వ్యాపారులు వోలం రాజు, కృష్ణుడు, చిదరాల వసంతరావు, బిజ్జాల ప్రభాకర్, తోకల శ్రీనివాస్‌రెడ్డి, సంకెపల్లి జనార్దన్ రెడ్డి, సట్ల శ్రీనివాస్, మహేశ్, జిల్లా వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles