కోర్టుకు హాజరైన ఎంపీ కవిత

Sat,August 17, 2019 03:09 AM

వరంగల్ లీగల్, ఆగస్టు 16: 2014 సంవత్సరంలో సాధారణ ఎన్నికల సందర్భంగా నమోదైన ఎన్నికల కేసులో శుక్రవారం మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత వరంగల్ అర్బన్ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. అప్పటి సాధారణ ఎన్నికల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కవిత ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి తేదీ:29-04-2014న గూడూరు మండలంలో ఎన్నికల ప్రచారం చేశారని కేసు నమోదైంది. జిల్లాలోని ఎన్నికల కేసులన్నీ విచారించే పీసీఆర్ కోర్టులో జరిగిన విచారణకు ఆమె హాజరయ్యారు. న్యాయమూర్తి భవాని తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేశారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles