అనేక సంక్షేమ పథకాలు

Fri,August 16, 2019 05:10 AM

తెలంగాణ రాష్ట్రం రావడం, కేసీఆర్ సీఎం అవ్వడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజల కోరిక తీరిందన్నారు. అనేక సంక్షేమ పథకాలు పేదలకు వర్తిస్తున్నాయన్నారు. ఊరూరా కృష్ణ, గోదావరి నీటిని ఫిల్టర్ చేసి తాగునీరు అందిస్తున్నామన్నారు. వివిధ పథకాల కోసం ప్రతీ ఏటా సుమారు రూ. 20వేల కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి అయిందని, నీటి ఎత్తిపోతల కోసం మోటార్లను రన్ చేసి రిజర్వాయర్లల్లో నీటిని నింపుతున్న విషయాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుగులోత్ అరుణ, జెడ్పీటీసీ తేజవత్ శారద, మాజీ ఎంపీపీ గుగులోత్ వెంకన్న, మాజీ జెడ్పీటీసీ భాల్ని మాణిక్యం, వైస్ ఎంపీపీ గాదె అశోక్‌రెడ్డి, మరిపెడ మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్, మరిపెడ పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకలు రాంబాబు, రవీందర్, అంబరీష, వస్రాం, జాటోత్ బాలాజీ, లతీఫ్, ఎల్ వెంకన్న, బోడా రెడ్యా, హన్మ, మక్సూద్, ఏడీఏ శోభన్‌బాబు, ఎంపీడీవో పూర్ణచందర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డితో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు మెప్మా సెర్ప్ సంస్థకు చెందిన స్థానిక బాధ్యులు పులి ఉమ, గంధసిరి ఉమ, ఎస్కే షమీమ్ తదితరులు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రెడ్యానాయక్ వారికి రాఖీ పౌర్ణమి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

పాలకుర్తి రూరల్ ఆగస్టు 15: డీఆర్‌డీఓ సెర్ప్ ఆధ్వర్యంలో చేపట్టే పేదరిక నిర్మూళన కార్యక్రమాలను పాలకుర్తి నియోజక వర్గంలో సమర్దవంతంగా అమలు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం హన్మకొండలోని తన నివాసంలో డీఆర్‌డీవో, ఐకేపీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణాభివృద్ధి శాఖ తరఫున పెట్టుబడి ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ స్త్రీనిధి సొంత నిధులతో చేపట్టే జీవనోపాధి అవకాశాలను గుర్తించాలన్నారు. బీమా సౌకర్యం కల్పించాలన్నారు. చిన్న, సన్నకారు రైతులకు అందుబాటులో లేని వ్యవసాయ యంత్రాలను పని ముట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. కస్టమ్ హైరింగ్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. రైతులు పండించి పంటలకు స్థానికంగా ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సాహించాలన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూళన సంస్థ అమలు చేస్తున్న కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. అన్ని రకాల రుణాలపై బీమా సౌకర్యం కల్పించి పేదవారికి అండగా నిలబడాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్‌డీవో గూడూరు రాంరెడ్డి, అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి ఎండీ నూరొద్దీన్, నిమ్మల వెంకన్న, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles