క్రీడల్లో రాణించిన వారికి బంగారు భవిష్యత్

Wed,August 14, 2019 01:55 AM

క్రీడల్లో రాణించిన వారికి విద్యా, ఉద్యోగాల్లో మెండుగా అవకాశాలు లబించి బంగారు భవిష్యత్ ఉంటుందని ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి అన్నారు. ఈ నెల 8 నుండి 12 వరకు సూర్యపేట జిల్లా తిరుమలగిరిలో జరిగిన రాష్ట్రస్థాయి టగ్ ఆఫ్ వార్ పోటీల్లో స్థానిక మేచరాజుపల్లి జిల్లా పరిషత్‌కు చెందిన 14 మంది క్రీడాకారులు బాలుర, బాలికల 13, 17 ఏళ్ల విభాగంలో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. వీరికి మంగళవారం పాఠశాలల ఆవరణంలో ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో విజేతులుగా నిలిచిన 14 మంది మన పాఠశాల క్రీడాకారులు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొంటారన్నారు. అక్కడ కూడా మంచి ప్రతీభ కనబర్చి ప్రథమ స్థానంలో నిలిచి అంతర్జాతీయ స్థాయికి ఎంపికై గ్రామ, మండల, జిల్లా ఖ్యాతీని మార్మోగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు మిత్తింటి శ్రీనివాస్‌లు, వ్యాయమ ఉపాధ్యాయుడు సీహెచ్ ఐలయ్య, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles