జోరుగా నాట్లు

Mon,August 12, 2019 03:58 AM

-వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు
-అనుకూలించిన వర్షాలు
-చెరువులు, కుంటల్లో జలకళ
-ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాత
-31,881 హెక్టార్లలో వరిసాగవుతుందని అధికారుల అంచనా
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. నాలుగు రోజుల క్రితం వరకు కురిసిన వర్షాలతో రైతులు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా కురిసిన వానలకు చెరువులన్ని జలకళను సంతరించుకుంది. దీంతో రైతులు వరినాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా వరినాట్ల పనులు జోరుగా సాగుతున్నాయి. వరినాట్లతో పాటు పత్తి, మక్కజొన్న తదితర పంటలకు కలుపు తీస్తూ యూరియా, ఇతర మందులు చల్లుతున్నారు. నాలుగు రోజుల క్రితం వరకు వరుసగా వారం రోజుల పాటు కురిసిన వర్షాలతో చెరువుల్లోకి నీరు వచ్చి చేరింది. అంతే కాకుండా ఇప్పటి వరకు నాట్లు వేయని రైతులు నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో రైతులు ఎక్కువగా వరి, పత్తి, మక్కజొన్న, మిర్చి పంటలు సాగవుతున్నాయి. ఇందులో ఎక్కువగా పత్తి, మిర్చి పంటలను పండిస్తారు. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో పంటలకు ప్రాణం పోసినట్టయ్యింది. ఏటా వాన కాలం సీజన్‌లో ఒకటి, రెండు వర్షాలు కురవగానే రైతులు పత్తిగింజలు నాటుతారు. ఈనెల మొదటి వారంలో కురిసిన వర్షాలతో చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి.

చాల చెరువులు నిండగా, మిగతా చెరువుల్లోకి సగానికి పైగా నీళ్లు వచ్చాయి. దీంతో చెరువులు, కుంటల కింద సాగు చేసుకునే రైతులకు ఊరట లబించింది. చెరువుల్లోకి నీరు రావడంతో రైతులు నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో చెరువులు, కుంటల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో జిల్లాలోని 16మండలాల్లో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. గత నెలలో వర్షాలు కురవకపోవడంతో రైతులు వరినాట్లు వేయడం కాస్త ఆలస్యం అయ్యింది. ఈ నెలలో వారం రోజుల పాటు వర్షాలు కురవడంతో వరినాట్లు ఊపందుకున్నాయి. జిల్లాలో బోరుబావుల ద్వారా వచ్చే నీటితో వరినాట్లను ఇప్పటికే వేశారు. ఇటీవల వర్షాలు సమృద్ధిగా కురవడంతో వాగులు, వర్రెలు ప్రవహించడంతో చెరువులు, కుంటల్లోకి నీళ్లు చేరాయి. దీంతో చెరువుల కింద ఉన్న రైతులు నారీ మళ్లను సిద్ధం చేసి నాట్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఇటీవల కురిసిన వర్షాలతో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి.

అనుకూలించిన వర్షాలు
జిల్లాలో ఈనెల మొదటి వారంలో వారం రోజులు వర్షాలు కురిసాయి.ముందుగా మూడు రోజుల పాటు ముసురుతో కూడిన వర్షంతో పాటు మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిశాయి.దీంతో జిల్లా వ్యాప్తంగా పత్తి, మక్కజొన్న, మర్చి పంటలకు ప్రాణం పోశాయి. గతంలో వర్షాలు సరిగా లేక పంటల ఎదుగుదల కూడ సరిగా లేదు. దీంతో ఇటీవల వరుసగా వారం రోజుల పాటు కురిసిన వర్షాలతో వివిధ పంటలకు ఊపిరిచ్చినట్లు అయ్యింది. అంతే కాకుండా జిల్లా వ్యాప్తంగా వరినాట్లు జోరందుకున్నాయి. అంతకుముందు అక్కడక్కడ వేసిన వరినాట్లు ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు నాట్ల పనుల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. ముందుగా మూడు రోజుల పాటు ముసురు, తరువాత మూడు రోజులు భారీ వర్షాలు కురవడంతో జిల్లా వ్యాప్తంగా చెరువుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వరినాట్లు జోరందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నయ్యారు.

చెరువులకు జలకళ..
జిల్లాలో కురిసిన వర్షాలతో చెరవులన్ని జలకళను సంతరించుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1560 చెరువులు ఉండగా ఇందులో పూర్తి స్థాయిలో నిండిన చెరువులు 42ఉన్నాయి. 75 నుంచి 100శాతం నిండిన చెరువులు 132 ఉండగా, 50నుంచి 75శాతం 281 చెరువులు ఉన్నాయి. 25నుంచి 50శాతం నిం డిన చెరువులు 662 ఉన్నాయి. 0నుంచి 25శాతం వరకు నిండి న చెరువులు 443 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 16మండలాల్లోని 1560 చెరువులు, కుంటల్లోకి వరదనీరు చేరడంతో రైతులు వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. జిల్లా వ్యాప్తం గా వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో జిల్లాలోని చెరువుల్లో నీరు లేక రైతులు వరినాట్లు వేయలేదు. ఈనెలలో కురిసిన ముసురుతో పాటు భారీ వర్షాలతో రైతులు నాట్లు వేస్తున్నారు.

జోరుగా వరినాట్లు..
ఈనెలలో వర్షాలు సమృద్ధిగా కురవడటంతో జిల్లాలో వరినాట్ల పనులు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలో మొత్తం 31,881హెక్టార్లలో వరి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 16మండలాల పరిధిలో ఇప్పటి వరకు 15,510 హెక్టార్లలో వరినాట్లు వేశారు. ఇంకా 16,371 హెక్టార్లలో వరి నాట్లకు రైతులు ఏర్పాట్లు చేస్తున్నారు. వరినాట్లు వేసేందుకు ఈ నెల చివరి వరకు అవకాశం ఉండటంతో వ్యవసాయశాఖ అంచనా వేసిన దాని ప్రకారం మొత్తం హెక్టార్లలో వరిసాగు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల చెరువులు, కుంటల్లోకి నీళ్లు రావడంతో రైతులు నారు మడ్లు దున్ని నాట్లు వేస్తున్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles