బొగతలో పర్యాటకుల సండే సందడి

Mon,July 22, 2019 02:01 AM

వాజేడు, జూలై 21 : మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయగార బొగత జలపాతానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. సండే సెలవు రోజు కావడం తో రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జలపాతం ముందు భాగంలో ఏర్పా టు చేసిన స్విమ్మింగ్‌పూల్‌లో స్నానాలు చేస్తూ సెల్ఫీలు దిగు తూ సందడిచేశారు. బొగత జలపాతం వద్ద ఉన్న హట్స్, పకోడలు తిరుగుతూ చిల్డ్రెన్స్‌పార్క్‌లో తిరుగుతూ బొగత రెస్టారెంట్‌లో భోజనాలు చేసి సేదతీరారు. బొగత జలపాతం వద్ద ఉన్న బటర్‌ైఫ్లె పార్క్, పకోడలు, చిల్డ్రెన్స్‌పార్క్ వద్ద ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేశారు.

జిప్‌లైన్ రైడింగ్ ప్రారంభం..
బొగత జలపాతం వద్ద వాచ్ టవర్ ముందు భాగం నుంచి చిల్డ్రెన్స్ పార్క్‌వరకు నూతనంగా రైడింగ్ కోసం జిప్‌లైన్, సైక్లిం గ్ రైడింగ్ రోప్ ద్వారా వెళ్లేలా ఏర్పాటు చేశారు. దీనిని పర్యాటకుల కోసం ఆదివారం ప్రారంభించారు. ఈ రైడింగ్ యువతీయువకులు పోటీపడి పై నుంచి రోప్ వైర్ నుంచి కిందకు వెళుతూ ఆనందంగా గడిపారు. బొగత వద్ద మరిన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేయనున్నట్లు ఎఫ్‌ఆర్వో డోలి శంకర్ తెలిపారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles