హరితహారాన్ని యజ్ఞంలా పూర్తి చేయాలి

Thu,July 18, 2019 03:47 AM

- ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలి
- నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి
- ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, కలెక్టర్ శివలింగయ్య

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జూలై 17: ఐదో విడత హరితహారంలో పర్యావరణ పరిరక్షణకు విరివిగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షిం చి భావితరాలకు అందించాలనే లక్ష్యంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ సీహెచ్. శివలింగయ్య పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని నందన గార్డెన్స్‌లో జిల్లా అటవీ శాఖ అధికారి కిష్టాగౌడ్ అధ్యక్షతన మహబూబాబాద్ నియోజకవర్గంలోని అధికారులు, ప్రజాప్రతినిధులకు ఐదో విడత హరితహారంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మా ట్లాడారు. హరితహారాన్ని ఒక యజ్ఞంలో చేపట్టి ప్రతి ఒక్కరూ భాగస్వాములై హరిత జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు. రాష్ట్రంలో 24 శాతం ఉన్న అటవీ ప్రాం తాన్ని 33 శాతానికి పెంచడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదేళ్లలో 230 మొక్కలు నాటడంతో పాటు వాటిని సం రక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఐదో విడతలో జిల్లాలో 2.48కోట్ల మొక్కలు నాటే లక్ష్యం నిర్దేశించుకొని, ప్రభుత్వ శాఖలకు లక్ష్యాలను కేటాయించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. జిల్లాలోని 410 నర్సరీల్లో ఆయా గ్రామాలకు సంబంధించిన మొక్కలను పెంచి నాటేందుకు సిద్ధంగా ఉంచామన్నారు. నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం..గ్రామపంచాయతీకి పర్యావరణం పచ్చదనంపై స్పష్టమైన బాధ్యతలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతీ గ్రామపంచాయతీలో ఆయా గ్రామాలకు అవసరమైన మొక్కలను నర్సరీలో పెంచి నట్లు పేర్కొన్నారు. గ్రామ పరిధిలో ఉన్న బంజర భూ ములు, బీడు గుట్టలు, చెరువు శిఖంలో వివిధ సంస్థ లు, గ్రామ రోడ్లు, ఆవాస రోడ్లు, ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటించి గ్రామాన్ని పచ్చగా చేయవలసిన బాధ్యత సర్పంచులకు చట్టంలో పొందుపరిచారన్నా రు.

జిల్లాలో 8 లక్షల జనాభా ఉందని, ఒక్కొక్కరు కనీసం 30 మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని 162 గ్రామపంచాయతీల్లో ప్రతీ గ్రామపంచాయతీ ఖచ్చితంగా 60 వేల వివిధ రకాలైన మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. భూగర్భ జలాలు పెంచేందుకు కేంద్రప్రభుత్వం చేపట్టిన జలశక్తి అభియాన్ కార్యక్రమ ఆవశ్యకతను గ్రామస్తులకు వివరించాలన్నారు. నెలాఖరు కల్లా జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించనున్న నేపథ్యం లో సర్పంచ్‌లు పోటీపడి తమ గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటించుకోవాలన్నారు. గ్రామాన్ని పారిశుధ్యంగా ఉం చేందుకు రోడ్డు మీద చెత్త వేసినా, చెట్టు నరికినా , ఇం టి ముందు మురికి కాలువలు నీరు ఆగినా జరిమానా విధిస్తామని గ్రామపంచాయతీల్లో బ్యానర్లు ప్రదర్శించడంతో పాటు నిబంధనలు అమలయ్యేలా చూడాలని తెలిపారు. ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని ప్రతీ ఇంటి నుంచి పొడి చెత్త సేకరించి సాలిడ్ వేస్ట్ మేనెజ్‌మెంట్ నిర్వహించాలని అన్నారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ పెద్ద ఎత్తున మొక్కలు నాటి అడవి తల్లి రుణం తీర్చుకుని, బంగారు తెలంగాణకు బాటలు వేద్దామని తెలిపారు. భావితరాల భవిష్యత్‌ను ఆలోచించి ఐదేళ్లలో 33 శాతం పచ్చదనం పెంచేందుకు సీఎం కేసీఆర్ హరితహారం చేపట్టారన్నారు.

హరితహారంలో సర్పంచ్‌లతో పాటు ప్రజాప్రతినిదులు గ్రామం లో కనీసం 60 వేల మొక్కలు నాటేలా కృషి చేయాలన్నారు. సర్పంచ్ గ్రామానికి పెద్ద దిక్కు అన్నారు. ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ పోలీసుశాఖకు 3లక్షల మొక్క లు నాటే లక్ష్యా న్ని నిర్ణయించినట్లు తెలిపారు. త్వరితగతిన అందరికంటే ముందే లక్ష్యాన్ని పూర్తి చేస్తామని అన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ చేపడుతామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఫారెస్ట్ డెవలప్‌మెంట్ అధికారి కృష్ణమాచారి, మండల ప్రత్యేక అధికారులు బాలరాజు, ఆనంద్‌కుమార్,డీఆర్డీఎ సూర్యనారాయణ, ఏడీఏ లక్ష్మినారాయణ, ఏఓ వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీలు గుగులోత్ సుచిత్ర, ప్రియాంక, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీలు మౌనిక చంద్రమోహన్,ఎర్రబెల్లి మాధ వి, కోఆప్షన్ సభ్యుడు ఖాసీం, ఎంపీడీవోలు, సర్పంచ్‌లు సత్యనారాయణరెడ్డి ఎంపీటీసీలు, గ్రామకార్యదర్శులు,ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles