జలశక్తి అభియాన్‌పై అవగాహన ర్యాలీ

Thu,July 18, 2019 03:45 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగా, జూలై 17: సమస్త ప్రాణకోటికి జీవనాధరమైన నీటిని సంరక్షించడంతో పాటు భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కల్టెకర్ సీహెచ్. శివలింగయ్య అన్నారు. బుధవారం పట్టణంలోని నందన గార్డెన్ నుంచి ఎమ్మెల్యే శంకర్‌నాయక్, ఎస్పీ కోటిరెడ్డితో కలిసి జలశక్తి అభియాన్ అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాటాడుతూ కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జల్‌శక్తి అభియాన్‌ను ప్రారంభించిందన్నారు. మొదటి విడతలో ఈనెల 1 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జల్‌శక్తి అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టి అన్ని నీటి రక్షణ, నిర్వహణ ద్వారా సమగ్రమైన విధానం ద్వారా దేశంలో జిల్లాలో నీటి ఎద్దడి గల గ్రామాన్ని నీటి మిగులు గ్రామంగా మార్చడం జలశక్తి అభియాన్ లక్ష్యమని తెలిపారు. రోజురోజుకూ జనాభా పెరగడంతో పాటు నీటి వినియోగం పెరుగుతున్నదన్నారు.

దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ప్రతీ ఒక్కరు నీటిని పొదుపుగా వాడుకోవడంతో పాటు వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం చేయడం వల్ల నీటిని పొదుపుగా వాడొచ్చన్నారు. ప్రచార మాధ్యమాలతో నీటి యొక్క ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం కల్పించి నీటిని రక్షించి పొదుపుగా వాడుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నీటి ఆవశ్యకతను వివరిస్తూ గ్రామస్తుల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రతీ ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించుకునేలా ప్రోత్సహించాలన్నారు. ఫాం పాండ్స్, ఇంకుడు గుంతల ఏర్పాటు వల్ల బోరుబావుల్లో, చెరువుల్లో భూగర్భజలాలు నీటి మట్టం పెరుగుతుందని గ్రామస్తులకు వివరిస్తూ నీటిని పొదుపుగా వినియోగించుకునేలా వారిని చైతన్యవంతులు చేయాలన్నారు. ర్యాలీలో డీఆర్డీవో సూర్యనారాయణ, జిల్లా అటవీశాఖాధికారి కిష్టాగౌడ్, భూగర్భ జలాల డిప్యూటీ డైరెక్టర్ ఆనంద్‌కుమార్, డీఆర్డీఏ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles