ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

Wed,July 17, 2019 06:07 AM

మహబూబాబాద్ రూరల్, జూలై 16: జిల్లా కేంద్రంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలో భాగంగా మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ పత్తిపాక రోడ్డులో కొలువుదీరిన సాయి బాబా మందిరం ప్రత్యేకతను కలిగి ఉందన్నారు. షిరిడీ సాయి కటాక్షం నియోజకవర్గ ప్రజలందరికీ ఉండాలన్నారు. పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి కావాలని షిరిడీ సాయిని వేడుకున్నానని అన్నారు. పట్టణంలోని సాయి మందిరంతో పాటు పలు ఆలయాల్లో పూజా కార్యక్రమాలు చేపట్టారు. షిరిడీ మందిరంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుంచే బారులుతీరారు. ఆలయం ఆవరణలో సాయి సేవాట్రస్టు ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయంలో చేపట్టిన భజన, కీర్తనలు భక్తులను భక్తిసాగరంలో ముంచెత్తాయి. చంద్రగ్రహణం నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఆలయం తెరిచి ఉంచడంతో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో షిరిడీ సాయి మందిర సేవా ట్రస్ట్ సభ్యులు, పాల్వాయి రామ్మోహన్‌రెడ్డి, మార్నేని వెంకన్న, ఎండీ ఫరీద్, గుండ రాజశేఖర్, బానోత్ రాజేష్, ఈశా, శోభ, నాళ్ల వీరన్న, రాజేష్, కొండ్లె సూరయ్య, చౌడవరపు రంగన్న పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles