మెడిసిన్ సీటు సాధించిన విద్యార్థులకు సన్మానం

Wed,July 17, 2019 06:06 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ, జూలై 16 : నీట్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించి మెడిసిన్ సీటు సాధించిన ఇద్దరు విద్యార్థినులను ఎల్లంపేట హైస్కూల్‌కు చెందిన 1992-93 టెన్త్ బ్యాచ్ పూర్వపు విద్యార్థులు మంగళవారం సన్మానించారు. మండలంలోని ఎల్లంపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ తాళ్లపెల్లి రాణి శ్రీనివాస్ దంపతుల కుమార్తె అభిజ్ఞ, ఎల్లంపేట స్టేజికి చెందిన పోడేటి విమల వెంకన్న కుమార్తె నవ్యశ్రీని స్థానిక హైస్కూళ్లో సన్మానించి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా జర్పుల కాలునాయక్, మక్కా అంజన్న, లింగంపల్లి దయానందర్ మాట్లాడారు. ఈ ఇద్దరు విద్యార్థినులు ఎల్లంపేట, ఎల్లంపేట స్టేజికి చెందినవారు కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో ఉన్నత స్థానాలకు చేరుకుని సామాజిక డాక్టర్లుగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. వీరిని భవిష్యత్తు తరం విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అభిజ్ఞ, నవ్వశ్రీ తల్లితండ్రులకు వారు ప్రత్యేక అభినందనలను తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు గండి పరమేశ్, అశోక్, శోభన్, కారంపుడి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles