బయ్యారంలో సదరం క్యాంపునకు విశేష స్పందన

Wed,July 17, 2019 06:06 AM

బయ్యారం జూలై 16 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం గార్ల, బయ్యారం మండలాలకు సంబంధించి ఏర్పాటు చేసిన సదరం క్యాంపునకు విశేష స్పందన లభించింది. ఈ క్యాంపును ఎంపీపీ గుగులోత్ జయశ్రీ ప్రారంభించారు. వివిధ గ్రామాల నుంచి 580 మంది క్యాంపునకు రాగా.. ఫిజియోథెరపి డాక్టర్లు పరీక్షలు నిర్వహించి 203 మందిని అర్హులుగా తేల్చారు. అయితే క్యాంపునకు వచ్చిన వారికి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. క్యాంపులో శారీరక అంగ వైకల్యం ఉన్న వారికే పరీక్షలు నిర్వహించారు. అవగాహన లోపంతో పలువురు మానసిక వైకల్యం, చెవుడు, మూగ, అంధులు వచ్చినప్పటికీ వెనుదిరుగాల్సి వచ్చింది సదరం క్యాంపును జిల్లా చైర్‌పర్సన్ ఆంగోత్ బిందు సందర్శించి పరిశీలించారు. నిర్వాహుకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైకల్యం కలిగిన వారు సదరం క్యాపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటపతిరాజ్, ఏపీఎం శంకర్, వైద్యాధికారి రాజ్‌కుమార్, వైస్ ఎంపీపీ మధుకర్‌రెడ్డి, శ్రీకాంత్ నాయక్, మంత్యా ఉన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles