వాజేడు ఏజెన్సీలో గ్రావెల్‌ దందా..!

Mon,July 15, 2019 01:12 AM

-ప్రభుత్వ భూముల్లోని చెట్ల తొలగింపు
-అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ నాయకులు
-తరలింపుదారులు బెదిరించినట్లు వెల్లడి
-వాజేడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు
వాజేడు,జూలై,14: ఒక వైపు సీఎం కేసీఆర్‌ అడవులను రక్షించేందుకు హరితహారం పేరుతో మొక్కలు నాటిస్తుంటే మరో వైపు అందుకు విరుద్ధంగా కొందరు అక్రమార్కులు పచ్చని చెట్లను తొలగిస్తున్నారు. ఫలితంగా సర్కారు లక్ష్యం నీరుగారడంతోపాటు ప్రకృతి సంపద కనుమరుగవుతోంది. దీనిపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా వాజేడు మండలంలోని మండపాక గ్రామ సమీపంలోని 163 జాతీయరహదారికి 100 అడుగుల దూరంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో ఆదివారం కొందరు అక్రమంగా జేసీబీ సహాయంతో చెట్లను తొలగించి గ్రావెల్‌ను లారీల్లో ఏటూర్‌నాగారానికి తరలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పూసూరు సర్పంచ్‌ బోదెబోయిన సరళ, స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు గ్రావె ల్‌ తరలిస్తున్న లారీలను ఆపారు. గ్రావెల్‌ను ఎక్కడికి తరలిస్తున్నారని ప్రశ్నించగా తమకు కలెక్టర్‌ అ నుమతి ఉందని, మీకు ఎంత డబ్బులు కావాలని అని తరలింపుదారులు బెదిరించినట్లు సర్పంచ్‌ బో దెబోయిన సరళ, టీఆర్‌ఎస్‌ మండల అధికార ప్రతినిధి పెనుమల్లు రామకృష్ణారెడ్డి,నాయకులు ఆరోపించారు. అక్రమ తరలింపుపై ఆర్డీవో రమదేవి, వాజేడు తహసీల్దార్‌ రమాదేవిలకు ఫోన్లో ఫిర్యాదు చేయడంతోపాటు వాజేడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు టీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. అయితే ఈ గ్రావెల్‌ను ఏటూర్‌నాగారం లో ఒక రహదారి నిర్మాణానికి తరలిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయంపై వివరణ కోసం ‘నమస్తే తెలంగాణ’ వాజేడు తహసీల్దార్‌ను సంప్రదించగా ఫోన్‌ లిప్ట్‌ చేయకపోవడం కోసమేరుపు. కార్యక్రమంలో కాకర్లపూడి మనోజ్‌, రానిమేకల రాంబాబు, చెన్నం ఎల్లయ్య, తల్లడి నానబాబు, టీ రవీందర్‌, ఎన్‌ రవీందర్‌, నర్సింహరావు, వెంకటేశ్వర్లు, ప్రమీల, వీవీఎస్‌ వర్మ,తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles