పేదలకు వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌

Mon,July 15, 2019 01:12 AM

బయ్యారం, జూలై 14: పేద ప్రజలకు వరం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ అని ఎమ్మెల్యే హరిప్రియ నాయ క్‌ అన్నారు. మండలంలోని పలు కుటుంబాలకు ఆదివారం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను పంపిణీ చేశారు. మండల కేంద్రానికి చెందిన విషుకు రూ.16500, గొల్లగూడేనికి చెందిన పద్మకు రూ.24000, గంథంపల్లికి చెందిన బీమ్‌రావుకు 11000 రూపాయల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఎక్కువ మందికి సహా యం చేయాలనే లక్ష్యంతో మందుకు సాగుతున్నారని అన్నారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ సాయాన్ని త్వరగా అందేలా చూస్తున్నారని తెలిపారు. పేద ప్రజలు అపద సమయాల్లో ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకో వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చేపూరి మౌనిక, వైస్‌ ఎంపీపీ తాత గణేశ్‌, నాయకులు గంగుల సత్యనారాయణ, తిరుమల ప్రభాకర్‌రెడ్డి, ఎనుగుల ఐలయ్య, జూలకంటి సీతారాంరెడ్డి, శ్రీను,మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles