తొర్రూరు పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతా...

Sun,July 14, 2019 01:52 AM

పాలకుర్తి రూరల్ జూలై 13: తొర్రూరు మున్సిపాలిటీని మోడల్‌సిటీగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి నీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధిపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ సుధాకర్‌రావు, వివిధ శాఖల అధికారులు పట్టణ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రూ.45కోట్లతో చేపట్టాల్సిన పనులపై ప్రణాళికను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తొర్రూరు పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. రూ.25కోట్లతో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వార్డుల్లో పెం డింగ్‌లో ఉన్న పనులపై అధికారులు నాయకులు దృష్టి సారించాలని సూచించారు. తొర్రూరు పట్టణాభివృద్ధికి రెండో విడతలో మంజూరైన రూ.20కోట్ల పనులను గుర్తించాలన్నారు. వార్డుల పర్యటనలో భాగంగా తన దృష్టికి వచ్చిన అభివృద్ధి పనులకు నిధులను కేటాయించాలన్నారు. ఈ నెల 25వ తేదీన రెండో విడత మంజూరైన రూ.20కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తానన్నారు.

తొర్రూరు పట్టణాన్ని సిద్ధిపేట తరహాలో అభివృద్ధి చేస్తానన్నారు. మొత్తం రూ.45 కోట్లతో పట్టణంలో సీసీ రోడ్లు, ఫార్మేషన్ రోడ్లు, మోడల్ మార్కెట్, సైడు కాల్వలు, పార్కుల అభివృద్ధి వంటి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని, పట్టణంలో తాగు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే వచ్చే మున్పిపాలిటీ ఎన్నికల్లో తొర్రూరు మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగురాలని నాయకులకు సూచించారు. అందుకోసం ప్రతీ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆనంతరం తొర్రూరు పట్టణాభివృద్ధికి రూ.20కోట్లు మంజూరు చేసినందుకు పట్టణ టీఆర్‌ఎస్ నాయకులు మంత్రి ఎర్రబెల్లిని అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ గుండెబాబు, మీషన్ భగీరథ ఈఈ మల్లే శం, డీఈ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వర్‌రె డ్డి, మండల ఇన్‌చార్జి గుడిపుడి మధుకర్‌రావు, నాయకులు డాక్టర్ సోమేశ్వర్‌రావు, జెడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్, ఎంపీపీ తూర్పాటి చిన్న ఆంజ య్య, కు ర్ర శ్రీనివాస్, అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కర్నె సోమయ్య, మండల అధ్యక్షుడు వసుమర్తి సీతారాములు, రామిని శ్రీనివాస్, మాడ్గుల న ట్వర్, బిజ్జాల అనిల్, జినుగు సురేందర్‌రెడ్డి, శామకూరి ఐలయ్య, దారవత్ సోమన్న, ముద్దసాని సురేశ్ పాల్గొన్నారు.

58
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles