మున్సిపోల్స్‌కు సర్వం సిద్ధం చేయాలి

Sat,July 13, 2019 04:46 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జూలై 12 : త్వరలో జరుగనున్న మున్సిపాలిటీ ఎన్నికల ఏర్పాట్ల ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్, మహబూబాబాద్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారి శివలింగయ్య ఆదేశించారు. శుక్రవారం ఆయన మహబూబాబాద్ మున్సిపాలిటీని ఆకస్మికంగా సందర్శించి, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆ యన ఓటర్ల జాబితా నమునాను పరిశీలించి, 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఓటర్లకు సంబంధించిన అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం జరుగుతుందని వెల్లడించారు. ఈ నెల 18న ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఓటర్ల జా బితా ఎలాంటి దోషాలు లేకుండా చేసుకోవాలన్నారు. గత అ సెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా వార్డుల వారీగా ఓ టర్ల జాబితాను రూపొందించాలన్నారు. వార్డులో డీలిమిటేష న్, ఓటర్ల జాబితా ప్రక్రియ పటిష్టంగా జరిగేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు. 800 ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఏ ర్పా టు చేయాలని ఒకే కుటుంబానికి చెందినవారు ఒకే కేంద్రంలో ఉండేలా చూడాలన్నారు. మున్సిపాలిటీలోని ప్రతీ మూడు వార్డులకు ఒక రిటర్నింగ్ అధికారితోపాటు మొత్తం 12 మందిని జోనల్ అధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. మహబూబాబాద్‌లోని గాంధీపార్కులో డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రం పక్కా భవనంలో ఉండాలని, పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి కనీసం వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఎన్నికల నియమావళి అమలు చేస్తూ ఫ్లయింగ్ స్కాడ్, నిఘా బృందాలను ఎన్నికల సిబ్బందికి తగు శిక్షణ ఇవ్వాలని కోరారు. ఓటర్ల జాబితా, ఎన్నికల సామగ్రి, ఎన్నికల పోలింగ్ సిబ్బంది, మొదటి రాండమైజేషన్, ఓటర్ల డ్రాప్స్ పబ్లికేషన్‌ను ఈనెల 18లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీల పరిధిలో వార్డుల డీలిమిటేషన్, ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు గురించి వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి వివరించాలన్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుటకు ప్రతీఒక్కరు సహకరించాలని చెప్పారు.

అనంతరం మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించి పనులను వేగవంతంగా చేపట్టి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణలో ఎన్టీఆర్ స్టేడియంలో అభివృద్ధి పనులను ప్రారంభించాల్సిందిగా వారం రోజుల క్రితం ఆదేశించినప్పటికీ పనులు మొదలు కాకపోవడంపై మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా కాంట్రాక్టర్లకు వారి కాంట్రాక్ట్ రద్దుకు ఎందుకు నోటీసులు జారీ చేయలేదని అధికారులను ప్రశ్నించారు. పనులు వెంటనే ప్రారంభించని పక్షంలో వారి కాంట్రాక్టును రద్దు చేయనున్నట్లు హెచ్చరించారు. అంతకుముందు సిబ్బంది అందరూ హాజరువుతున్నారా లేదా అని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనారెడ్డి, డీఈ లాల్, ఏఈ ఉపేందర్, మున్సిపల్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles