రెవెన్యూ సిబ్బందికి ఆర్డీవో కొమరయ్య ఆదేశం

Sat,July 13, 2019 04:43 AM

బయ్యారం జూలై 12 : రైతుల భూసమస్యల విషయంలో నిర్లక్ష్యం చేయోద్దని ఆర్డీవో కొమరయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ సమస్యలకు సంబంధించిన పలు ఫైళ్లను, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. గ్రామాల రైతులు తమ భూసమస్యల పరిష్కారం కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని వీఆర్వోలు ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకొని మరీ పరిష్కరించాలని అన్నారు. కార్యాలయానికి వచ్చిన బాధిత రైతులతో మర్యాదగా నడుచుకోవాలని తెలిపారు. అర్హులైన రైతులకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని తెలిపారు. కార్యాలయంలోని కొందరి ఉద్యోగులు, సిబ్బందిపై తీవ్రంగా అనినీతి అరోపణలు , ఫిర్యాదులు వస్తున్నాయని వారు పద్ధతి మార్చుకోవాలని లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నూతన ఎంపీపీ మౌనిక ధ్రువీకరణ పత్రం విషయంలో ఫిర్యాదులు రావటంతో ధ్రువీకరణ పత్రానికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పుల్లారావు, డిప్యూటీ తహసీల్దార్ చక్రపాణి, ఆర్‌ఐ చందర్ తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles