మైనార్టీ గురుకులంలో సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Sat,July 13, 2019 04:43 AM


తొర్రూరు రూరల్, జూలై12: మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఆయా తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి అర్హులైన మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ కరుణకుమార్ కోరారు. శుక్రవారం స్థానిక మైనార్టీ గురుకుల పాఠశాలలో మాట్లాడుతూ 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు 70సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. వాటిని ముస్లీం మైనార్టీ విద్యార్థులతో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 5వ తరగతిలో 33సీట్లు, 6వ తరగతిలో 12 సీట్లు, 7వ తరగతిలో 10 సీట్లు, 9వ తరగతిలో 15 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. జూలై 17వరకు సీట్ల భర్తీ ప్రక్రియ చేపడుతామన్నారు. అర్హులైన మైనార్టీ విద్యార్థులు టీసీ, ఆదాయం, కులం, ఆధార్ పత్రాలు సమర్పించి ప్రవేశం పొందాలన్నారు. ప్రభుత్వం మంచి భోజనం, నాణ్యమైన కార్పొరేట్ స్థాయి విద్య, వసతి ఇతర సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థినిపై రూ.1.12లక్షలు వెచ్చిస్తుందన్నారు. పూర్తి ఇంగ్లిష్ మీడియంలో తరగతులు నిర్వహిస్తుందన్నారు. మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles