బ్యాంకు రుణాలు వినియోగించుకోవాలి

Sat,July 13, 2019 04:42 AM

నర్సింహులపేట: డీసీసీ బ్యాంకు రుణాలు సద్వినియోగం రైతులు సద్వినియోగం చేసుకోవాలని పీఏసీఎస్ చైర్మన్ మైదం దేవేందర్ తెలిపారు. శుక్రవారం మండలంలోని కొమ్ములవంచ గ్రామంలో బ్యాంకు రుణాలపై రైతులకు అవగహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దేవేందర్ మాట్లాడుతూ డీసీసీ బ్యాంకులో రైతులకు వాహన రుణాలు అందించనున్నట్లు చెప్పారు. అదే విధంగా గొర్రెల పెంపకం, డెయిరీ, ఫౌల్ట్రీఫాంకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నట్ల చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్లు, బ్యాంకు మేనేజర్ రజిత, ఏజీఎం యశ్వత్, యాదగిరి, కార్యదర్శి వినోద్, రైతులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles