డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి

Thu,July 11, 2019 05:32 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, జులై 10: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం డివిజన్ కేంద్రంలోని విశ్రాంతి భవనంలో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణం కోసం జిల్లా వ్యాప్తంగా స్థలాలను సేకరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా 751 ఇళ్ల స్థలాలను ఆయా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలకు అందజేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ స్థలాలను అందజేసి నివేదికలను ఆర్డీవోల ద్వారా సమర్పించాలని ఆదేశించారు. ట్రైబల్ వెల్ఫేర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు 546 స్థలాలు, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌కు 175 స్థలాలు, భద్రాచలం ట్రైబల్ వెల్ఫేర్ టిక్కెట్ ఇంజినీర్‌కు 50 ఇళ్ల స్థలాలను వెంటనే అందజేయాలని అన్నారు. తొర్రూరు, పెద్దవంగర మండలాల్లో డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణానికి మొత్తం స్థలాలను అందజేసినట్లు ఆర్డీవో ఈశ్వరయ్య కలెక్టర్‌కు తెలిపారు. వాటి నిర్మాణాలు త్వరలో పూర్తచేయాల న్నారు. ఈ సమీక్ష సమావేశంలో తొర్రూరు తహసీల్దార్ రమేశ్‌బాబు, డబుల్‌బెడ్‌రూంల ఇళ్ల జిల్లా సహాయ నోడల్ అధికారులు సదానందం, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles