జగ్జీవన్‌రాం ఆశయాలను కొనసాగించాలి

Sun,July 7, 2019 01:41 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, జూలై 6: భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రాం ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య సూచించారు. జగ్జీవన్‌రాం 33 వర్ధంతి సందర్భంగా బాబు జగ్జీవన్‌రాం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం పాలకేంద్రం వద్ద ఉన్న జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడారు. దేశ అభ్యున్నతి కోసం తన జీవితకాలం సేవ చేశారని, దళిత హక్కుల సాధన కోసం చట్టసభల్లో రాజీలేని పోరాటం సాగించారని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని నేటి సమాజంలో ఉన్న వర్గాలన్నీ అసమానతలకు వ్యతిరేకంగా చైతన్యవంతులుకావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశానికి దళితరత్న, కమిటీ కార్యదర్శి సోమారపు ఐలయ్య అధ్యక్షత వహించాగా దళితరత్న గుండాల నర్సయ్య, ఎంపీపీ తుర్పాటి చిన్న అంజయ్య, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, తహసీల్దార్ రమేశ్‌బాబు, ఎంపీడీవో గుండె బాబు, ఎంఈవో మహంకాళి బుచ్చయ్య, వెలికట్ట సర్పంచ్ పోసాని పుష్పలీల, ఎంపీటీసీ బత్తుల మల్లమ్మ, ఎంఈఎఫ్ నాయకులు ఎన్ వెంకన్న, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు రాయిశెట్టి వెంకన్న, కొత్తపల్లి రవి, యాకేందర్, ఉపేందర్, రవి, శంకర్, వెంకన్న, రాములు, యాకయ్య, కాలునాయక్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలి
విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత పౌరులుగా ఎదగాలని తొర్రూరు ఆర్డీవో ఈశ్వరయ్య సూచించారు. డివిజన్ కేంద్రంలో బర్డ్స్ సంస్థ ఆధ్వర్యంలో పలు పాఠశాలల నుంచి ఎంపిక చేసిన పేద విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, పెన్నులు అందజేసే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుకు పేదరికం ఆడ్డుకాదని, ప్రణాళికాయుతంగా కష్టపడి చదివితే మంచి భవిష్యత్ పొందవచ్చన్నారు. ఈ సమావేశానికి బర్డ్స్ సంస్థ డైరెక్టర్ సిస్టర్ హెలెన్ అధ్యక్షతన వహించగా సీఐ వీ చేరాలు, సిస్టర్లు నిర్మల, పద్మావతి, సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles