భూగర్బ జలాలు పెంచుకుందాం

Sun,July 7, 2019 01:41 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జూలై 06 : భూగర్భ జలాలు పెరిగేలా సమష్టిగా కృషి చేయాలని కేంద్రప్రభుత్వ ఆర్థిక సలహాదారు ఆర్‌కే జేనా పేర్కొన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ మందిరంలో కలెక్టర్ సీహెచ్. శివలింగయ్య అధ్యక్షతన సంబంధిత శాఖల అధికారులతో జలశక్తిఅభియాన్ కార్యక్రమం జిల్లాలో అమలుచేయడంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జల్‌శక్తి అభియాన్‌ను ప్రారంభించిందన్నారు. మొదటి విడతలో ఈనెల 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా జల్‌శక్తి అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. నీటిరక్షణ, నిర్వహణ ద్వారా సమగ్రమైన విధా నం రూపొందించి దేశంలో జిల్లాలో నీటి ఎద్దడి గల గ్రామాలను నీటి మిగులు గ్రామాలుగా మార్చడం జల్‌శక్తి అభియాన్‌లక్ష్యం అన్నారు. దేశవ్యాప్తంగా 257 నీటి ఎద్దడి గల జిల్లాలు ఉండగా మన రాష్ట్రంలోని 23 జిల్లాల్లో 124 బ్లాకులను తక్కువ భూగర్భ జలాలు గలవిగా గుర్తించామన్నారు. మహబూబాబా ద్ జిల్లాలోని దంతాలపల్లి, నర్సింహులపేట, తొర్రూర్, పెద్దవంగర, మరిపెడ మండలాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. సం బంధిత అధికారులు బాధ్యతగా ప్రజల్లో వర్షపు నీటిని భూమి లో ఇంకేలా ఒడిసి పట్టడంతో పాటు ప్రతీ ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించేలా ప్రజల్లో అవగాహన కలిపించాలని అన్నారు. రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం చేయడం వల్ల నీటిని పొదుపుగా వాడవచ్చని తెలిపారు. కార్యక్రమాన్ని పక డ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత సంబంధిత శాఖలపై ఉందన్నారు. కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాలు పెంచుటకు చర్యలు తీసుకుంటున్నామన్నా రు. వర్షపు నీటిని ఒడిసిపట్టి రక్షించుటకు పొల్యూషన్ థాంక్స్, చెక్‌డ్యాం, ఫాంపాండ్స్, ఇంకుడు గుంతలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నాలుగేళ్లలో నాలుగు సంవత్సరాల్లో కోట్ల మొక్కలు పెంచామన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడా నికి పలు కార్యక్రమాలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ సూర్యనారాయణ, జిల్లా అటవీశాఖాదికారి కిష్టాగౌడ్, జిల్లా వ్యవసాయాధికారి చత్రునాయక్, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, జిల్లా నీటిపారుదల అధికారి జగదీష్ పాల్గొన్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles