మోడల్ స్కూల్‌కు వాసవీక్లబ్ చేయూత

Sun,July 7, 2019 01:41 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ, జూలై 06 : మరిపెడ మోడల్ స్కూల్‌కు స్థానిక వాసవీక్లబ్ చేయూతనిస్తోంది. ఈ స్కూల్ ఏర్పాటైనప్పటి నుంచి క్లబ్ సభ్యులు సహాయం అందిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం పాఠశాలకు మరిపెడ వాసవీక్లబ్ తరుఫున రూ.50వేల విలువైన 25 సిమెంట్ బెంచీలను బహుకరించారు. అదేవిధంగా టెన్త్‌క్లాస్‌లో 10/10జీపీఏ సాధించిన విద్యార్థి పాలబిందెల శశిసుహాస్‌కు రూ.10వేల ఆర్ధికసాయం క్లబ్ బాధ్యులు దారం నాగేశ్వర్‌రావు అందజేశారు. గ్రంథాలయానికి వంగేటి భద్రయ్య రూ.5వేలు ఇచ్చారు. బ్యాండ్ పరికరాలకు రూ.6వేలు అందచేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ప్రేమ్‌కుమార్ వాసవీక్లబ్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో క్లబ్ బాధ్యులు బోనగిరి సురేశ్, నాగేశ్వర్‌రావు, భద్రయ్య, జానకీరాములు, బోనగిరి సత్యనారాయణ, వుప్పల కృష్ణ పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles