హరితహారానికి ఏర్పాట్లు..

Sat,July 6, 2019 02:59 AM

- ఐదో విడతలో 2.48కోట్ల మొక్కలు నాటే లక్ష్యం
- అటవిశాఖ ఆధ్వర్యంలో 82లక్షలు, డిఆర్‌డిఏ ద్వారా 2కోట్ల మొక్కలు సిద్ధం
- 402 నర్సరీలలో మొక్కల పెంపకం
- ఈ నెల మూడో వారంలో ప్రారంభానికి ఏర్పాట్లు..
మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఐదో విడత హరితహారానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది 96లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఏడాది 2.48కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అటవిశాఖ ఆధ్వర్యంలో 82 నర్సరీల ద్వారా 82లక్షలు, జిల్లా గ్రామీణభివృద్ధిశాఖ ద్వారా 320 నర్సరీలలో 2కోట్ల మొక్కలు పెంచి సిద్ధంగా ఉంచారు. ఇందులో గత ఏడాది 96లక్షలు ఉన్న హరితహారం లక్ష్యాన్ని ఈ సంవత్సరం 2.48కోట్లకు చేర్చారు. ఇందులో 90లక్షలు టేకు, మరో 60లక్షలు అడవుల్లో పెంచే మొక్కలు, 30లక్షలు పండ్ల మొక్కలు, మరో 30లక్షలు నీడనిచ్చే మొక్కలు, మరో 38లక్షలు పూల మొక్కలతో పాటు ఈత మొక్కలను పెంచారు. గ్రామ పంచాయతీల వారిగా మొక్కలు నాటేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళికలు తయారు చేశారు. గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణ కోసం అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అటవిశాఖలో చాల ప్రభుత్వ శాఖలను భాగస్వామ్యం చేస్తూ లక్ష్యాన్ని నిర్ధేశించారు. ఈ ఏడాది నుంచి మొక్కల సంరక్షణ బాధ్యత ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, ఉప సర్పంచులతో పాటు పంచాయతీ కార్యదర్శులకు అప్పగించనున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కను కాపాడేందుకు క్షేత్రస్థాయిలో రక్షణ దళాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్థాయిలో సర్పంచ్ అధ్యక్షతన కమిటీని నియమించారు. ఆ కమిటీ హరితహారంలో నాటిన మొక్కలను పర్యవేక్షించనున్నారు. అదేవిధంగా 600లకు పైగా నాటిన మొక్కలకు ప్రభుత్వం ప్రతీ నెలా నిర్వహణ ఖర్చులను కూడా ఇస్తుంది. ఒక మొక్కకు రూ.5 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.జిల్లాలో ఇప్పటికే నాలుగు విడతలుగా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు ఐదో విడత హరితహారంలో 2,48కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు. జిల్లాలో గత ఏడాది 96లక్షల మొక్కలు నాటాలని నిర్ణయించి దిగ్విజయంగా పూర్తి చేశారు. నాలుగో విడత హరితహారంతో పోలిస్తే 1,52 కోట్ల మొక్కలు అదనంగా నాటాలని నిర్ణయించారు. ఈ ఏడాది జిల్లాకు ప్రభుత్వం కేటాయించిన లక్ష్యం 2.48కోట్లు ఉంది. ఇందులో 2కోట్ల మొక్కలు గ్రామీణాభివృద్ధిశాఖ, అటవీశాఖ లో 82 లక్షల మొక్కలు నర్సరీలలో సిద్ధంగా ఉన్నాయి.ఈ నెల మూడో వారంలో జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంబించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తయారైన ప్రణాళికలు..
గ్రామ పంచాయతీల వారిగా మొక్కలు నాటేందుకు ఇప్పటికే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. గ్రామాల్లో నాటిన మొక్కల సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలతో పాటు ఇళ్ల వద్ద మొక్కల పెంపకం చేపడుతారు. ప్రజలకు అవసరమైన పండ్లు, పూలు, టేకు మొక్కలను గ్రామ పంచాయతీ నర్సరీల్లో పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఈనెల మూడో వారంలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంబించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ఉన్న పలు శాఖలకు ఏశాఖ ఎన్ని మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని అధికారులు నిర్ణయించారు. ఇందులో ఎక్కువగా డిఆర్‌డిఏ శాఖతో పాటు అటవిశాఖ అధికారులు ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. వీటితో పాటు ఎక్సైజ్, మున్సిపాలిటీ, పోలిస్, తదితర శాఖలకు లక్ష్యాన్ని నిర్ధేశించారు. హరితహారం కార్యక్రమం ప్రారంబం కాగానే అన్ని ప్రభుత్వ శాఖలకు లక్ష్యాన్ని నిర్ధేశించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని శాఖలకు తగిన లక్ష్యాన్ని నిర్ధేశించారు.

టార్గెట్- 2.48కోట్లు..
జిల్లా ఏర్పడిన తరువాత 2017లో 90లక్షలు, 2018లో 96లక్షల మొక్కలను అధికారులు నాటారు. ప్రస్తుతం ఈ ఏడాది 2.48కోట్లకు నిర్ధేశించారు. జిల్లాను హరితహారంగా మార్చేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్ సూచించారు. ఇప్పటికే హరితహారంపై రెండు మార్లు సమీక్షలు నిర్వహించి అటవిశాఖ, డిఆర్‌డిఏ శాఖలకు పలు సూచనలు చేశారు. ఇచ్చిన లక్ష్యాన్ని అన్ని శాఖలతో సంయుక్తంగా హరితహారం కార్యక్రమం నిర్వహించి విజయవంతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ఏడాది జిల్లాకు ప్రభుత్వం కేటాయించిన లక్ష్యం 2.48కోట్లు ఉంది. ఇందులో 2కోట్ల మొక్కలు గ్రామీణాభివృద్ధిశాఖ, 82లక్షలు అటవీశాఖ మొక్కలు నర్సరీలలో సిద్ధంగా ఉంచారు.ఈ నెల మూడో వారంలో జిల్లా వ్యాప్తంగా హరితహారం కార్యక్రమాన్ని ప్రారంచనున్నారు. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు.

హరిత హారానికి ఏర్పాట్లు పూర్తి- డీఎఫ్‌వో కిష్టాగౌడ్
ఐదో విడత హరితహారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే నర్సరీలలో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఈ నెల మూడో వారం లేదా చివరి వారంలో ప్రారంబించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ ఏడాది హరితహారం కార్యక్రమం ద్వారా 2.48కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించాం. ఇందులో 2కోట్లు మొక్కలు గ్రామీణాభివృద్ధిశాఖ, 82లక్షల మొక్కలు అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి కొన్ని గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేయడం వల్ల మొక్కలను అక్కడి నుంచే రవాణ చేయనున్నాం. ఈసారి ఎక్కువగా 90లక్షల టేకు మొక్కలను పెంచాము. త్వరలో హరితహారం కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా ప్రారంబిస్తాం.

94
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles