టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు సహకరించాలి

Sat,July 6, 2019 02:55 AM

-ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌కు టెక్స్‌టైల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల వినతి
కురవి, జూలై 05: నూతనంగా ఏర్పడిన మహబూబాబాద్ జిల్లా పరిసరాలలో పద్మశాలీ కులస్థులు ఎక్కువగా ఉన్నారని వారిని దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ సహాయంతో మహబూబాబాద్ జిల్లా పరిసరాలలో మినీ టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటుచేసేలా కృషిచేయాలని శ్రీ వీరభద్రస్వామి టెక్స్‌టైల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మచ్చ వీరన్న ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌ను కలిసి విన్నవించారు. ఎమ్మెల్సీకి పూలబొకేతోపాటు వినతిపత్రాన్ని అందచేశారు. ఈ సందర్బంగా అధ్యక్షులు వీరన్న మాట్లాడుతూ...ఇక్కడ పద్మశాలీలకు పనులు లేక మహబూబాబాద్‌జిల్లా పరిసర ప్రాంతాల నుండి సుమారు 30వేల మంది సూరత్‌పట్టణానికి వలసలు పోయారన్నారు. తల్లిదండ్రులు ఇక్కడ, వారు కుటుంబంతో అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వసల నివారణకు ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి ఈ ప్రాంతంలో మిని టెక్స్‌టైల్స్ పార్కు క్లస్టర్‌కు స్థలం కేటాయించేలా చూడాలని సత్యవతిని కోరినట్లు తెలిపారు. అందులకు ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ సానుకూలంగా స్పందించారన్నారు. సీఎంతో చర్చించి తగు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కూరపాటి వెంకన్న, ఎం.ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles