విద్యార్థి దశలో నెట్‌తో ఇక్కట్లే....

Sat,July 6, 2019 02:55 AM

-డీఎస్పీ నరేష్‌కుమార్
-కురవి జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో సురక్షిత పాఠశాల కార్యక్రమం
కురవి, జూలై 05: అత్యున్నత శిఖరాలకు పాఠశాల జీవితం ఎంతో కీలకమైందని...విద్యార్థి దశలో ఇంటర్నెట్, సోషల్ మీడియా వలన అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని మహబూబాబాద్ డీఎస్పీ ఎ.నరేష్‌కుమార్ అన్నారు. కురవి మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పాఠశాల హెచ్‌ఎం వహీద్ అధ్యక్షతన సేఫ్ స్కూల్స్ ప్రోగ్రాంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న డీఎస్పీ నరేష్‌కుమార్ విద్యార్థులతో మాట్లాడారు. తాను చిన్న తనంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యను అభ్యసించానని చిన్నతనం రోజులను గుర్తుచేసుకున్నారు. సమాజంలో విద్యార్థులపై ప్రభావం చూపే మాధక ద్రవ్యాలు, నెట్ సినిమాలు, టీవీల వలన ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.

ఉలి దెబ్బ తలగకపోతే రాయి శిల్పం కాదు...
డీఎస్పీ నరేష్‌కుమార్ విద్యార్థులను ఆలోచించేలా ఆత్మీయ ప్రసంగం చేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులు చూపిన మార్గంలో పయణించి కన్నతల్లిదండ్రులకు, పుట్టిన ఊరుకు మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఉలి దెబ్బలు తగలకపోతే రాయి శిల్పం కాదని విద్యార్థులు గుర్తుంచుకోవాలన్నారు. కష్టపడి ఇష్టంగా చదువుకున్న వారే ఉన్నత లక్ష్యాలను అధిరోహించగలరన్నారు. ముఖ్యంగా నేడు నెట్ అందరినీ ఏలుతుందన్నారు. విద్యార్థి దశ ఎంతో కీలకమైందని ఈ సమయంలో ఎటువంటి నెట్ అకౌంట్‌లు లేకుంటే మంచిదన్నారు. ముఖ్యంగా బాలికలు ఈ దశలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలన్నారు. బాలికలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తిన 100గాని, 1098 కు గాని డయల్ చేయాలన్నారు. చట్టం మీకు ఎప్పుడు రక్షగా ఉంటుందన్నారు. బాలలు తమ హక్కులను తెలుసుకోవాలన్నారు. బాలబాలికలు చెడువ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులకు దూరంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా 8,9వ తరగతి విద్యార్థిని విద్యార్తులకు బాలికలపై జరుగుతున్న హింస-పరిణామాలు, పరిష్కార మార్గాలు అనే అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించగా పావని మొదటి స్థానం, ప్రవళికకు రెండవ స్థానం, సంతోషీకి తృతీయ స్థానం దక్కించుకున్నారు. చిత్రలేఖనం పోటీలు నిర్వహించగా శ్రావ్యకు మొదటి స్థానం, శ్రీదర్‌గౌడ్‌కు ద్వితీయ స్థానం, విష్ణుకు తృతీయ స్థానాలు వచ్చినట్లు, ఉపన్యాస పోటీలలో సంతోషికి ప్రదమ, సమ్రీన్‌కు ద్వితీయ, యాస్మీన్‌కు తృతీయ స్థానం లభించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేందర్‌రెడ్డి, దామోదర్, ప్రసన్న, కె.అనిత, శ్రీధర్, అరుణకుమారీ, బిక్షపతి, బొందెలి వెంకన్న, నర్సింహాచారి, స్వర్ణ, కిష్టు, ప్రభాకర్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles