సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయంతం చేయాలి

Sat,July 6, 2019 02:55 AM

-మండల ఇంచార్జీ, బీజేపీ నాయకులు నేతాజీ పిలుపునిచ్చారు
గార్ల, జులై 05ః మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా నాయకులు, సభ్యత్వ నమోదు మండల ఇంచార్జీ నేతాజీ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు తోడేటి నాగరాజు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ ముఖ్య నాయకుల, కార్యకర్తల మండల స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలోనే సభ్యత్వ నమోదులో బీజేపీ గిన్నిస్ రికార్డు సాధించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. భారత్‌తో పాటు ప్రపంచ దేశాల్లోను భారతీయులు ఉన్నారని, వారంతా భారత ప్రధాని చేపడుతున్న పలు అభివృద్ది పనులను స్వాగతిస్తున్నారని, దేశంలోని సమస్త ప్రజలు బీజేపీ పాలన కోరుకుంటున్నారని నేతాజీ తెలిపారు. నేటి నుంచి బీజేపీ పార్టీ ఆద్వర్యంలో చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులతో పాటు నాయకులు, కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గోనాలని, సభ్యులుగా చేరదలుచుకునే వారు సెల్ నెంబరుః 89808 08080కు కేవల మెసెజ్ చేస్తే సభ్యత్వం నమోదు అవుతుందని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో వార్డు సభ్యులు సుమలత, లక్ష్మీ, జంపాల శ్రీను, రాము, అరవింద్, సతీష్, పిచ్చయ్య తదితరులు పాల్గోన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles