టీఆర్‌ఎస్‌తోనే రాష్ట్ర సుభిక్షం

Sat,July 6, 2019 02:54 AM

జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ నవీన్, జిల్లా రైస్ మిల్లర్స్ వెల్పేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రవిచంద్ర
టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రూ.2లక్షల రిస్క్ ఇన్స్‌రెన్స్
కార్యకర్తలకు గుర్తింపు కార్డులు
మరిపెడ, నమస్తేతెలంగాణ, జూలై 05ఃటీఆర్‌ఎస్‌తోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటదని, రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉంటారని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్, డోర్నకల్ టీఆర్‌ఎస్ యువ నేత డీఎస్ రవిచంద్ర అన్నారు. శుక్రవారం మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని భార్గవ్ ఫంక్షన్ హాల్‌లో మరిపెడ, చిన్నగూడూరు మండలాల టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరిపెడ మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు రామసహాయం సత్యనారాయణరెడ్డి అధ్యక్షతన జరుగగా నవీన్, రవిచంద్ర హాజరయ్యారు. టీఆర్‌ఎస్ ముఖ్య నేతలకు వారు క్రీయశీల సభ్యత్వాన్ని అందచేశారు. ఈ సందర్బంగా టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి నవీన్, రవిచంద్ర మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ అవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనకు సీఎం కేసీఆర్ చేసిన అలుపెరగని పోరాట పటిమను వివరించారు. రాష్ట్ర సాధన అనంతరం నిరుపేదలకు, రైతులకు, పేద ప్రజల కోసం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. నేను టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తనని గర్వపడేలా సీఎం కేసీఆర్ పరిపాలన విధానం ఉందన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు కానటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెట్టి ఏలాంటి అక్రమాలకు తావివ్వకుండా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ఒక్కరిదేనని చెప్పారు. కేసీఆర్ పరిపాలనకు అనుగుణంగా డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ నిరంతర శ్రామికుడిగా పని చేస్తున్నారన్నారు. ఏ మారుమూల గ్రామానికైన బీటీ రోడ్లు మీద వెళ్లేలా సకల సౌకర్యాలను ఎమ్మెల్యే రెడ్యానాయక్ పల్లె ప్రజల కోసం కలిపించారన్నారు. కరెంట్ విషయంలో కాని పాఠశాలల ఏర్పాటు, దళిత, గిరిజన తండాలకు సీసీ రోడ్లు ఏర్పాటు ఇలా చెబుతూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు రెడ్యానాయక్ కృషి ఫలితంగా జరిగాయన్నారు. ఇటివల జరిగిన పరిషత్ ఎన్నికల్లో రెడ్యానాయక్‌పై ప్రజలకు ఉన్న అపూర్వ గౌరవం వల్ల ఈ నియోజకరవ్గంలోని ఆరుకు ఆరు జడ్పీటీసీలు, ఆరు ఎంపీపీ స్థానాలు టీఆర్‌ఎస్ పార్టీ గెలిచిందన్నారు. మునుముందు కూడా పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు ఇదే స్ఫూర్తితో పని చేయాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు వారు పిలుపునిచ్చారు.

టీఆర్‌ఎస్ సభ్యత్వం ఉన్నోళ్లకు రూ.2లక్షల రిస్క్ ఇన్స్‌రెన్స్‌ః
టీఆర్‌ఎస్ సభ్యత్వం ఉన్న 59ఏళ్ల లోపు ప్రతి కార్యకర్తకు రెండేళ్ల పాటు రూ.2లక్షల రిస్క్ ఇన్స్‌రెన్స్ ఉంటదన్నారు. ప్రతి ఒక్కరికి పార్టీ గుర్తింపుగా ప్రత్యేక ఐడీ కార్డులను అందచేయడం జరుగుతుందన్నారు. మరిపెడ, చిన్నగూడూరు మండలాలలకు కలిపి 15వేల సభ్యత్వాలను టార్గెట్‌గా కేటాయించడం జరిగిందని ఈ సభ్యత్వ నమోదును ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు ఫుల్ పిల్ చేయాలన్నారు. ఈ నెల 10లోపు గ్రామాల వారిగా కేటాయించిన సభ్యత్వాలను పూర్తి చేసి, సభ్యత్వ రుసం, సభ్యత్వ పుస్తకాలను మండల పార్టీ బాధ్యులకు అందచేయాల్సి ఉంటుందన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నూకల వెంకటేశ్వర్‌రెడ్డి, మరిపెడ, చిన్నగూడూరు ఎంపీపీలు గుగులోతు అరుణరాంబాబు, వల్లూరి పద్మవెంకట్‌రెడ్డి, జడ్పీటీసీ తేజవత్ శారదరవీందర్‌నాయక్, మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న, మరిపెడ, చిన్నగూడూరు మండలాల వైస్ ఎంపీపీలు గాదె అశోక్‌రెడ్డి, పిల్లి వీరన్న, మాజీ ఓడీసీఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్‌రెడ్డి, మరిపెడ మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు నూకల శ్రీరంగారెడ్డి, కొంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, చిన్నగూడూరు మండల పార్టీ అధ్యక్షుడు వల్లూరి కృష్ణారెడ్డి, మరిపెడ పీఏసీఎస్ చైర్మన్ నందారపు నగేశ్, జిల్లా రైతు సమితి సభ్యులు రావుల వెంకట్‌రెడ్డి, జర్పుల కాలునాయక్, చిన్నగూడూరు మండల రైతు సమితి అధ్యక్షుడు మంగపతిరావు, ఎస్టీ సెల్ అధ్యక్షుడు డీఎస్ రాంసింగ్, కోఅఫ్షన్ సభ్యులు అబ్దుల్ మజీద్, మరిపెడ మాజీ ఎంపీటీసీలు గంధసిరి అంబరీష, కేలోతు వస్రాం, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మండల మైనార్టీ నాయకులు సయ్యద్ లతీఫ్, ఎస్కే.మక్సూద్ తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles