సభ్యత్వ నమోదులో మండలం రికార్డు సృష్టించాలి

Sat,July 6, 2019 02:53 AM

పెద్దవంగర,జూలై05:టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదులో పాలకుర్తి నియోజకవర్గంలో పెద్దవంగర మండలం రికార్డు సృష్టించాలని,రాష్ట్ర ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం, పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పని చేయడం జరుగుతుందని జడ్పీటిసి శ్రీరాం జ్యోతిర్మయి, పాలకుర్తి దేవస్థాన చైర్మెన్ వెనుకదాసుల రామచంద్రయ్యశర్మ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యుత్వ నమోదు ప్రక్రియలో పాల్గోని మాట్లాడారు. పార్టీలోని సాధారణ, క్రీయాశీలక సభ్యుత్వలను గ్రామాల్లోని ప్రతి ఒక్కరు పార్టీ సభ్యుత్వం పొందాలన్నారు. సభ్యత్వ నమోదుతో సభ్యత్వం పొందిన వారికి ఇన్సూరేన్స్ ఉంటుందన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం కావలసిన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ నిరుపేదల ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. రాష్ట్రంలో కాళేశ్వరం రైతులకు కావలసిన సాగునీరు, తాగునీరు అందుతుందన్నారు. ఈ నెల 10న తొర్రూర్ డివిజన్ కేంద్రంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని నిరుద్యోగులకు జాబ్‌మేళాను నిర్వహించడం జరుగుతుందని, ఈ జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం పొందిన వ్యక్తి ప్రమాదనికి గురైతే కుటుంబానికి రూ.2లక్షల ప్రమాద భీమా అందించడం జరుగుతుందని తెలిపారు. అలాగే మండలంలోని పడమటి తండా గ్రామ పంచాయితీ, కాన్వాయిగూడెం, ఉప్పరగూడెం, రాజామాన్‌సింగ్ తండా గ్రామాల్లో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యుత్వ నమోదును ప్రక్రియ టీఆర్‌ఎస్ నాయకులు చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు వెనుకదాసుల లక్ష్మీ, పటేల్‌నాయక్, రాజేందర్‌నాయక్, ఎంపిటిసిలు శ్రీనివాస్, విజయ, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఐలయ్య, ఉపసర్పంచ్‌లు రాము, శ్రీను, వార్డు సభ్యులు, టిఆర్‌ఎస్ నాయకులు సంజయ్, సుధీర్, సమ్మయ్య, వెంకన్న, షర్పుద్ధీన్, దుంపల వేణుసాగర్, నారాయణరెడ్డి, లింగమూర్తి, పుణ్యానాయక్, బుజ్జమ్మ, టిఆర్‌ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గోన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles