కాళోజీకి అంతర్జాతీయ ఖ్యాతి

Wed,June 26, 2019 02:04 AM

-హెల్త్‌వర్సిటీకి ఏఐయూలో సభ్యత్వం
పోచమ్మమైదాన్ (వరంగల్), జూన్ 25: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం (ఏఐయూ)లో సభ్యత్వం లభించింది. ఈమేరకు భారతీయ విశ్వవిద్యాలయాల సం ఘం సెక్రటరీ జనరల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారని యూనివర్సిటీ అధికారవర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తం గా ఉన్న విశ్వవిద్యాలయాలతోపాటు బంగ్లాదేశ్, భూటా న్, రిపబ్లిక్ ఆఫ్ క జకిస్తాన్, మలేషియా, మారిషస్, నేపాల్, థా యిలాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ యునైటెడ్ కింగ్‌డమ్ అసోసియేట్ మెంబర్లుగా ఉన్నారు. ఏఐయూలో సభ్యత్వం పొందటం ద్వారా వైస్ ఛాన్స్‌లర్ కాన్ఫరెన్స్, సెమినార్స్‌లో పాల్గొనే అవకాశం లభించింది. దీని ద్వారా ఇతర యూనివర్సిటీల్లో అనుసరిస్తున్న విధానాలతోపాటు మెరుగైన సేవలు అందించడానికి చేపట్టాల్సిన చర్చించి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు ఏర్పడుతుంది. అలాగే రీసెర్చ్, స్పో ర్ట్స్, యూత్, కల్చరల్ రంగాల్లో కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది. దీనితోపాటు ఏఐయూ పరిధిలోని యూనివర్సిటీ స్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొనే అవకాశం కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles