వరంగల్‌లోఫాస్ట్‌ట్రాక్ కోర్టు నెలకొల్పాలి

Wed,June 26, 2019 02:03 AM

-హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు ఎమ్మెల్సీ పోచంపల్లి లేఖ
వరంగల్ లీగల్, జూన్ 25: తొమ్మిది నెలల పసిమొగ్గను చిదిమేసిన హంతకుడిని కఠినంగా శిక్షించడం కోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టును వరంగల్‌లో నెలకొల్పాలంటూ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మం గళవారం హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. శ్రీహితపై జరిగిన అమానుషానికి యావత్తు ఓరుగల్లు పౌర సమాజం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యిందన్నారు. పార్టీలకతీతంగా, సిద్ధాంత రాద్ధ్దాంతాలకతీతంగా మౌనాన్ని వీడి విధుల్లోకి వచ్చి హంతకుని తక్షణమే శిక్షించాలంటూ నినదిస్తున్న ఈ సమయంలో వారి మనో వేదనను అర్థ్ధం చేసుకొని చట్టపరిధిలో హంతకుడిని శిక్షించాలంటే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ను ఏర్పాటు చేయడమే ఏకైక మార్గమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రత్యేక కోర్టును ఏర్పాటు చే యకుండా ఇప్పటికీ ఉన్న రెగ్యులర్ కోర్టులో ఈ కేసు విచారణ జరిపితే సత్వర విచారణ జరుగక అనేక అనుమానాలకు, అపోహలకు అవకాశం ఇచ్చినట్లవుతుందన్నారు. ప్రస్తుతం కోర్టులపై అనేక పెండింగ్ కేసుల భారం ఉన్నందున త్వరితగతిన సాక్ష్యాధారాలను విచారించే అవకాశం లేదన్నారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్ట మరింతగా ఇనుమడించడంతో పాటు ప్రభుత్వంపై, ప్రాసిక్యూషన్‌పై సదాభిప్రాయం పెరిగే అవకాశాలున్న ప్రస్తుత తరుణంలో చొరవ తీసుకొని శ్రీహిత ఆత్మ శాంతికోసం ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టును నెలకొల్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రాసిక్యూషన్ వర్గాలు కూడా సాక్ష్యాధారాలను సేకరించి ఈ ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో ప్రవేశపెట్టి, రోజువారీ విచారణ చేపట్టి, నిందితుడికి మరణదండన శిక్ష విధించాలని వారు కోరారు. హైకోర్టు జస్టిస్ అపాయింట్‌మెంట్ తీసుకొని స్వయంగా కూడా విజ్ఞప్తి చేస్తానని తెలిపారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles