బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే రెడ్యా

Wed,June 26, 2019 02:03 AM

కురవి, జూన్ 25: కురవి మాజీ ఎంపీపీ గుడిబోయిన రామచంద్రయ్య తల్లి లక్ష్మి గుండెకు సంబంధించి వ్యాధితో బాధపడుతూ సోమవారం రాత్రి మృతిచెందారు. విషయం తెలుసుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, ఆయన కుమారుడు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డీఎస్ రవిచంద్రలు లక్ష్మి మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. మృతురాలి కుటుంబీకులను పరామర్శించారు. అలాగే మండలంలోని తట్టుపల్లి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ భరతపురపు ఐలయ్య మృతిచెందడంతో ఎమ్మెల్యే రెడ్యానాయక్, డీఎస్ రవిచంద్రలు సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మృతుడికి నలుగురు కుమారులు, ఒక కుమార్తెలు ఉన్నారు. కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అన్నివిధాలా ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ నూకల వేణుగోపాల్‌రెడ్డి, జెడ్పీటీసీ బండి వెంకట్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తోట లాలయ్య, మండల అధికార ప్రతినిధి బజ్జూరి పిచ్చిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ముండ్ల రమేశ్, గుగులోత్ రవి, చెల్లగుండ్ల గణేశ్,నూతక్కి నర్సింహారావు, బెడద వీరన్న, గుగులోత్ నెహ్రు, ఐలి నరహారి, మట్ట చిన్న సైదులు, సంకూరి వీరన్న, పోతుగంటి వెంకన్న, అంతటి సురేశ్, జామ, రమేశ్, గాలి భిక్షం, వెంకన్న, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles