సేవే పరమావధి కావాలి

Wed,June 26, 2019 02:03 AM

-శాశ్వత ప్రాజెక్టులపై లయన్స్ దృష్టి సారించాలి
-లయన్స్ జిల్లా గవర్నర్ జాన్ బన్నీ
-ఉత్తమ ఫలితాల సాధకులకు, నేత్రదాతల కుటుంబీకులకు సన్మానం
తొర్రూరు, నమస్తే తెలంగాణ, జూన్ 25: మారుమూల ప్రాంతాలు, తండాలు, గూడేలు, చిన్నపాటి పల్లెల్లో లయన్స్‌క్లబ్ సేవలు విస్తరించిన రోజు సార్థకత చేకూరుతుందని 320ఎఫ్ లయన్స్ జిల్లా గవర్నర్ కేసీ జాన్ బన్నీ సూచించారు. తొర్రూరు లయన్స్ క్లబ్ 32వ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా సోమవారం రాత్రి ఎల్‌వైఆర్ గార్డెన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచ స్థాయిలో సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులందరికీ సేవే పరమావధి కావాలని పిలుపునిచ్చారు. నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించిన ఇన్‌స్టాలేషన్ అధికారి, జిల్లా ఉప గవర్నర్ తమ్మెర లక్ష్మినర్సింహారావు మాట్లాడుతూ తొర్రూరు లయన్స్ క్లబ్ చేపట్టిన కార్యక్రమాలు పట్టణవాసులకు ఎంతో ప్రయోజనం కలిగించడంతో తొర్రూరు క్లబ్ ప్రతీఏట సభ్యులతో పాటు సేవా కార్యక్రమాలను విస్తరించుకుంటూ పోతుందని అన్నారు. 32వ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార సందర్భంగా తొలి సేవా కార్యక్రమంగా పదో తరగతిలో 10/10 జీపీఏ సాధించిన అమ్మాపురం, హరిపిరాల, గుర్తూరు, కొడకండ్ల, మోడల్‌స్కూల్, పెద్దవంగర ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉడ్గుల శృతి, కొండ జయశ్రీ, కిన్నెర మౌనిక, ఉడుత మమత, ఆవుల వెన్నెలకు ఒక్కొక్కరికి రూ.3వేల చొప్పున నగదు ప్రోత్సాహంతో పాటు నోట్ పుస్తకాలను డాక్టర్ కే రాజేందర్‌రెడ్డి, దామెర సరేశ్, తమ్మి ఉపేందర్‌రావు, కొల్లూరు అశోక్ ఆర్థిక సహకారంతో అందజేశారు. అలాగే ఇటీవల మృతి చెందిన పలువురి నేత్రాల సేకరణకు సహకరించిన కుటుంబసభ్యులను సత్కరించారు.

నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం
తొర్రూరు లయన్స్ క్లబ్ 32వ నూతన కార్యవర్గ అధ్యక్షుడిగా కందుకూరి రాజు, ప్రధాన కార్యదర్శిగా కడారి నర్సింహారెడ్డి, కోశాధికారిగా పెరుమాండ్ల రమేశ్, ఉపాధ్యక్షులుగా తంగెళ్లపెల్లి వెంకటేశ్వర్లు, మహ్మద్ యాకూబ్, కొల్లూరి అశోక్, సంయుక్త కార్యదర్శిగా చిదిరాల నవీన్, సంయుక్త కోశాధికారిగా బోనగిరి శంకర్, మార్కెటింగ్ కమ్యూనికేషన్ చైర్మన్‌గా రేగూరి వెంకన్న, క్వెస్ట్ చైర్మన్‌గా అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, టెమర్‌గా తమ్మి రమేశ్, ట్విస్టర్‌గా ఎన్ విజయభాస్కర్‌తో పాటు డైరెక్టర్లు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో 1వ జిల్లా ఉప గవర్నర్ బుచ్చ రాజిరెడ్డి, పూర్వ గవర్నర్ డాక్టర్ కే రాజేందర్‌రెడ్డి, రీజియన్ చైర్మన్ ఏ భిక్షపతి, జోన్ చైర్మన్ ఎం సతీశ్‌రెడ్డి, ఎం సత్యనారాయణ, పీ హరికిషన్‌రెడ్డి, కే రఘోతంరెడ్డి, మూల శ్రీనివాస్‌తో పాటు తొర్రూరు క్లబ్ పూర్వ అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles