మైనర్ల అదృశ్యంపై తక్షణమే స్పందించాలి

Wed,June 26, 2019 02:02 AM

వరంగల్ క్రైం, జూన్ 25 : పోలీస్‌స్టేషన్లలో నమోదయ్యే మైనర్ల అదృశ్య కేసుల్లో పోలీసులు వెంటనే స్పందించి చేధించడంలో చొరవ చూపాలని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి కమిషనరేట్ పోలీస్ అధికారులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో మైనర్ బాలబాలికలు, మహిళలు, పురుషుల అదృశ్య కేసులకు సంబంధించి డీజీపీ హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కమిషనరేట్ కార్యాలయంలో వీడియో సమావేశానికి సీపీ రవీందర్, డీసీపీలు నరసింహ, నాగరాజు, శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మైనర్ల మిస్సింగ్ కేసుల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని, ఆచూకీ కనుగొనేందుకు ప్రత్యేక బృందాలను నియమించాలన్నారు. అదృశ్యమైన వ్యక్తుల ఫొటోలతో పాటు వారి సమాచారాన్ని స్టేషన్ అధికారులు వెబ్ అప్లికేషన్‌లో నమోదు చేయాల్సిన అవసరం ఉందనిన్నారు. అదృశ్యమైన మైనర్ బాలికలకు సంబంధించి పోలీస్‌స్టేషన్‌లో కిడ్నాప్ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు సూచించడం జరిగిందని, సుప్రీంకోర్టు సూచనలను అనుసరించి కిడ్నాప్ కేసులుగా నమోదు చేయాలని డీజీపీ పేర్కొన్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు నమోదైన మిస్సింగ్ కేసులతో పాటు, పెండింగ్‌లో ఉన్న కేసులు, అదృశ్యమైన బాలబాలికల ఆచూకీ కోసం చేపడుతున్న దర్యాప్తు తీరును సీపీ రవీందర్ ఈ సందర్బంగా డీజీపీకి వివరించారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles