కాశేశ్వరం ప్రాజెక్టు మహాద్భుతం

Tue,June 25, 2019 03:04 AM

కేసముద్రం రూరల్, జూన్ 24 : ప్రపంచంలోనే గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం అని, తెలంగాణ రాష్ట్రంలో మహాద్బుతమైన ప్రాజెక్టు నిర్మించిన అపర భగీరథుడు ముఖ్యమంతి కేసీఆర్ అని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ కొనియాడారు. సోమవారం స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంజీఎస్‌ఆర్‌ఈ జీఎస్ నిధులతో రూ.32 లక్షల అంచనాతో నిర్మించిన మహిళా స్త్రీ శక్తి భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ కదిరె రాధిక అధ్యక్షతన నిర్వహిచిన కల్యాణలక్ష్మీ, డ్వాక్రా గ్రూప్ రుణాలు, బీసీ కార్పొరేషన్ ద్వారా మంజూరై చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలో ఎవరూ చేయలేని విధంగా ఈనెల 21న మూడేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి ప్రారంభించిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. కోటి ఎకరాలకు సాగునీరు అందే ఈపథకం మహాఅద్బుతం అని అన్నారు. ప్రతీ ఊరు, ప్రతి వాడకు తాగునీరు ఇవ్వాలనే తపనతో మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు, కేజీ టూ పీజీ విద్యతోపాటు జిల్లా, మండల కేంద్రాలలో గురుకులాల నిర్మాణం, కల్యాణలక్ష్మీ, లండాలను నూతన జీపీలను ఏర్పాటు చేయడంతో పాటుగా తండాల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు. అదేవిధంగా రైతులకు పెట్టుబడి సహాయంగా ఎకరాకు రూ.10 వేలు ఇచ్చిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదన్నారు. ఈకార్యక్రమంలో నూతన ఎంపీపీ వోలం చంద్రమోహన్, జెడ్పీటీసీ బండారు పద్మ, నూతన జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, సర్పంచ్‌లు యనమాల ప్రభాకర్, బట్టు శ్రీనివాస్, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల రమేశ్, కోఆప్షన్ సభ్యుడు నజీర్ అహ్మద్, నూతన కో ఆప్షన్ సభ్యుడు నజీర్, నియోజక వర్గ అధికార ప్రతినిధి మర్రి రంగారావు, ఎంపీటీసీల రాష్ట్ర ఫోరం కార్యదర్శి మర్రి నారాయణరావు, జిల్లా సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణ, ఆత్మ చైర్మన్ నెహ్రూరెడ్డి, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బిలి మహేందర్‌రెడ్డి, కదిరె సరేందర్, దామరకొండ ప్రవీణ్, రావుల రవిచందర్‌రెడ్డి, డీఆర్‌డీవో పీడీ సూర్యనారాయణ, జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రూనాయక్, ఎంపీడీవో నాగేశ్వర్‌రావు, తహసీల్దార్ సురేశ్‌కుమార్, ఏపీఎం రాజీర్, మహిళా సంఘాలు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles