మా భూములకు రక్షణ కలిపించండి

Tue,June 25, 2019 03:02 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జూన్ 24 : మా భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, భూములకు రక్షణ కలిపించాలని తొర్రూరు మండల మాటేడు గ్రామ రైతులు గార ప్రేమ్‌కుమార్, ప్రతాపని లచ్చయ్య, మమత సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్ సెల్ వద్ద ముందు విధులు నిర్వహిస్తున్న టౌన్ సీఐ రవికుమార్ వారిని అడ్డుకుని నేరు గా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్యకు కలిపించారు. దరఖాస్తును పరిశీలించిన జిల్లా కలెక్టర్ తొర్రూరు ఆర్డీవోను పరిశీలించాలని సూచించారు. ఈ సందర్భంగా బాధితులు ప్రేమ్‌మ్‌కుమార్, లచ్చయ్య మాట్లాడారు. మాటేడు గ్రామ శివారు సత్యరెడ్డి కుంటలో మిషన్ కాకతీయ పనులు చేస్తున్నారని కుంటను మినీ ట్యాంక్ బాండ్‌గా నిర్మించేందుకు చెరువులో మట్టి తోడి మా పంట భూములను చెదరగొడుతున్నారని వాపోయారు. పలుమార్లు గ్రీవెన్స్‌లో దరఖాస్తు చేసుకున్నా ఫలితంలేదని, జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించేందుకు వచ్చామని తెలిపారు. చెరువు లోపలి భాగం సర్వే నంబర్ 43లో మాటేడు గ్రామ దళితులకు సేక్‌సిందు వృత్తి చేస్తున్నందున 9 మంది రైతుల్లో 1958లో 9.20 గుంటలు ఇనాంగా ఇచ్చారని, అదే భూమని 1976లో ఇనాం పట్టాలు ఇచ్చారని అన్నారు. కుంట నీట మునిగి తమకు అన్యాయం జరుతుగుతుందని వాపోయారు. మా భూమిలో జరుగుతున్న పనులు నిలిపివేసి న్యాయం చేయాలని కోరారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles