టీఆర్‌ఎస్ కార్యాలయ నిర్మాణానికి ఎకరం స్థలం

Sun,June 23, 2019 02:48 AM

మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి అధికారులు ఎకరం స్థలం కేటాయించారు. కలెక్టరేట్ సమీపంలో ఉన్న గిరిజన భవనం పక్కనే ఉన్న సర్వేనంబర్ 551లో ఎకరం స్థలాన్ని అధికారులు కేటాయించారు. ఈ స్థలంలో 24న కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఆంగోతు బిందు, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌లు స్థలాన్ని పరిశీలించారు. 2018 డిసెంబరులో మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న ఎకరం స్థలాన్ని గుర్తించారు. అయితే ఆ స్థలం కాస్త వివాదంలో ఉండటంతో వేరే చోట స్థలం కేటాయించాలని జిల్లాకు చెందిన టీఆర్‌నాయకులు, ప్రజాప్రతినిధులు కోరారు. దీంతో ప్రస్తుతం ఉన్న కలెక్టరేట్‌కు అతి సమీపంలో ఉన్న గిరిజన భవనం పక్కనే ఉన్న 551 సర్వేనంబర్‌లో ఎకరం స్థలం కేటాయించారు. ఈ స్థలాన్ని జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు నాయకులు పరిశీలించారు. 24న ఇక్కడ టీఆర్‌ఎస్ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నారు. ఇందుకోసం కేటాయించిన స్థలంలో చెట్లను, రాళ్లను తొలగిస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి పనులన్నీ పూర్తిచేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 24న ఉదయం 10గంటలకు పార్టీ కార్యాలయానికి జెడ్పీ చైర్మన్ ఆంగోతు బిందు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, మహబూబాబాద్, డోర్నకల్ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్‌నాయక్, డీఎస్ రెడ్యానాయక్‌లతో పాటు టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నూకల నరేష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట నాయకులు, జిల్లా నాయకులు పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాలో పార్టీ కార్యాలయాలకు శంఖుస్థాపనలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 24న ఉదయం 10గంటలకు జిల్లా కార్యాలయానికి శంకుస్థాపన చేయాలని నాయకులు నిర్ణయించారు.

రూ.60లక్షలతో నిర్మాణం
టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి ఎకరం స్థలం కేటాయించారు. ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ పేరుమీద నామినల్ రేటు ప్రకారం రూ.4,80లక్షలు చెల్లించారు. ప్రస్తుత కలెక్టరేట్‌కు అతి సమీపంలో ఉన్న గిరిజన భవనం పక్కన సర్వేనంబర్ 551లో ఎకరం స్థలం కేటాయించారు. ఇందులో నిర్మించే టీఆర్‌ఎస్ భవన నిర్మాణానికి పార్టీ రూ.60లక్షలు కేటాయించింది. ఎకరం స్థలంలో రెండు అంతస్థుల కార్యాలయం నిర్మించనున్నారు. ఇందులో కింద భాగంలో మీటింగ్ హాలుతో పాటు పై అంతస్తులో రెండు సూట్ రూములు, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు వేర్వేరుగా గదులను నిర్మించనున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించే కార్యాలయంలో అన్ని వసతులు ఉండే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా చైర్‌పర్సన్ చేతుల మీదుగా టీఆర్‌ఎస్ కార్యాలయానికి శంఖుస్థాపన జరుగనుంది.

శంకుస్థాపన చేయనున్న జెడ్పీచైర్‌పర్సన్
జిల్లా కేంద్రంలో నిర్మించే టీఆర్‌ఎస్ కార్యాలయానికి 24న ఉదయం 10గంటలకు శంఖుస్థాపన చేయనున్నారు. జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఆంగోత్ బిందు భూమిపూజతో పాటు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌తో పాటు మహబూబాబాద్ ఎంపీ కవిత, డోర్నకల్, మహబూబాబాద్ ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్‌లతో పాటు టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తక్కళ్ల పల్లి రవీందర్‌రావు, నూకల నరేశ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్‌రావు, జిల్లాలో జెడ్పీటీసీలు, ఎంపీపీలతో పాటు ఇతర నాయకులందరూ భారీ ఎత్తున పాల్గొననున్నారు. వరంగల్ నుంచి ఇతర నాయకులు కూడ వచ్చే అవకాశం ఉందని జిల్లా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు శంకుస్థాపన కోసం పనులు ఏర్పాట్లు చకచక సాగుతున్నాయి. ఇప్పటికే ఆ స్థలంలో చదును పనులు పూర్తి చేయగా, శిలాఫలకానికి సంబంధించిన గద్దె నిర్మాణ పనులు కూడ పూర్తయ్యాయి.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles