కేసీఆర్ గొప్ప మహర్షి

Sat,June 22, 2019 02:20 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జూన్ 21: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్ శ్రేణులు పండుగ జరుపుకున్నారు. సంబరాల్లో ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణకు గొప్ప మహర్షి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభం కావడం తెలంగాణ ప్రజలకు జీవం పోసినట్టేనన్నారు. ఆంధ్రాపాలకుల చేతుల్లో దగా పడ్డా తెలంగాణ కాళేశ్వరం ఎత్తిపోతలతో సస్యశ్యామలం అవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షల ఎకరాలు రెండు పంటలకు సాగు నీరు అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, మార్నేని వెంకన్న, కెఎస్‌ఎన్‌రెడ్డి, పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, తేల్ల శ్రీను, ముత్యం వెంకన్న, జెడ్పీటీసీ లాలావత్ ప్రియాంక, ఎంపీపీ భూక్య మౌనిక, కో-సభ్యుడు నీలేశ్‌రాయి, పుచ్చకాయల క్రిష్ణ, మార్నేని కిరణ్, భూక్య లక్ష్మి, అశోక్, షఫీయోద్దీన్, రఘు, సురేందర్, శోభ, వెంకన్న, దిడుగు సుబ్బారావు, దామునాయక్, ఇతర ప్రజాప్రతినిదులు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles