రైతుబాంధవుడికి రక్షగా నిలవాలి

Sat,June 22, 2019 02:16 AM

-ఆలయంలో ఎమ్మెల్సీ ప్రత్యేక పూజలు
-అంబరాన్నంటిన సంబురాలు
కురవి, జూన్ 21: రైతు సంక్షేమమే ధ్యేయంగా పాటుపడుతున్న మనసున్న మారాజు సీఎం కేసీఆర్ అని, డోర్నకల్ ప్రజలంతా ఆయనకు రక్షగా నిలవాలని ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ అన్నారు. కురవి మండలంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌కు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, కాళేశ్వరం ప్రాజెక్టు దిగ్విజయం కావాలని కోరుతూ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం సెంటర్‌లో టపాసులు పేల్చారు. తొలిసారిగా కురవికి విచ్చేసిన జడ్పీచైర్‌పర్సన్‌కు ఎంపీపీ దంపతులు, మండల పార్టీ ఆధ్వర్యంలో బొకే అందచేసి, శాలువా కప్పారు. ర్యాలీగా ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. బతుకమ్మలతో, బోనాలతో సంబురాలు అం బరాన్నంటాయి. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం, వడ్లతో అభిషేకించారు.

ఈ సందర్భంగా ఎంపీపీ బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ మాట్లాడారు. కాళేశ్వరం ఆశామాశీ ప్రాజెక్టు కాదని, వేలాది కోట్లు ఖర్చుపెట్టిన సీఎం కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారు. అనంతరం తాజా జెడ్పీచైర్‌పర్సన్ ఆంగోత్ బిందు మాట్లాడారు. తొలిసారిగా విచ్చేసిన జెడ్పీచైర్‌పర్సన్‌ను, ఎమ్మె ల్సీ సత్యవతిరాథోడ్‌ను ఎంపీడీవో కార్యాలయం ఘనంగా సత్కరించింది. ఈ సమావేశంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ నూకల వేణుగోపాల్‌రెడ్డి, తాజా జెడ్పీటీసీ బండి వెంకట్‌రెడ్డి, ఆలయ చైర్మన్ సోమిశెట్టి శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు తోట లాలయ్య, ప్రత్యేక అధికారి సీపీవో కొంరయ్య, ఎంపీడీవో కె ధన్‌సింగ్, తహసీల్దార్ శ్రీనివాస్, ఈవోఆర్డీ విజయలక్ష్మీ, ఎపీవో ఏకాంబ్రం, ఎపీఎం ఏకాంబ్రం, సర్పంచ్ నూత క్కి పద్మానర్సింహారావు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ ముండ్ల రమేశ్, ఎర్రంరెడ్డి సుదాకర్‌రెడ్డి, యానాల గంగాధర్‌రెడ్డి, రంగ మ్మ, శోభారాణి రమేష్, జీవన్, ఎర్ర నాగేశ్వర్‌రావు, కొణతం విజయ్, గుగులోత్ రవి, చిన్నం భాస్కర్, రంజాన్, జంగిలి హరిప్రసాద్, బస్వ శ్రీనివాస్, మేక నాగిరెడ్డి, ఐలి నరహారి, బుక్కమఠం వీరన్న, బాదె నాగయ్య, వీరన్న, భరత్,శ్రీనివాస్, తుకారాం నాయ క్, బండారి వెంకటరమణ, హరిప్రసాద్, దైద భద్రయ్య, లలిత, ఉష, సంగెం రమాదేవీ, ఐకెపి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles