అపర భగీరథుడు సీఎం కేసీఆర్

Sat,June 22, 2019 02:16 AM

మరిపెడ, నమస్తేతెలంగాణ, జూన్ 21: అపర భగీరథుడు సీఎం కేసీఆరేనని డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోతు రెడ్యానాయక్ అన్నారు. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముక్తేశ్వరుడి సన్నిధిలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను (జాతికి అంకితం చేసిన అనంతరం) ప్రారంభించగా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో టీఆర్‌ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే రెడ్యానాయక్ పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం జరిపారు. అనంతరం ఆయన మాట్లాడారు. చరిత్ర పుటల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచి పోతారన్నారు. ఉత్తర తెలంగాణకు వర ప్రదాయిని కాశేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు. పదేళ్లుగా తీవ్ర కరువు దుర్భిక్షంతో తల్లడిల్లుతున్న డోర్నకల్ నియోజకవర్గ రైతులకు ఈ ప్రాజెక్ట్ ద్వారా లాభం చేకూరుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్, మరిపెడ ఎంపీపీలు తాళ్లపెల్లి రాణిశ్రీనివాస్, గుగులోత్ అరుణరాంబాబు, జెడ్పీటీసీలు భాల్ని మాణిక్యం, తేజవత్ శారదరవీందర్, మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్, వైస్ ఎంపీపీ గాదె అశోక్‌రెడ్డి, పట్టణ టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles