ఘనంగా జయశంకర్‌సార్ వర్ధంతి

Sat,June 22, 2019 02:16 AM

మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, జూన్ 21: మహబూబాబాద్ విశ్వకర్మ ఎంప్లాయిస్ వెల్‌ఫేర్ అసోసియేషన్(వేవా) ఆధ్వర్యంలో ఘనంగా జయశంకర్‌సార్ వర్ధంతిని నిర్వహించారు. శుక్రవారం స్థానిక మదర్‌థెరిస్సా సెంటర్ వద్ద వేవా ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ సార్ 8వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు దొంతోజు ఓంకార్ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియమాకాలు విషయంలో తెలంగాణ ప్రజలను జాగృతం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషించిన గొప్ప మహానుభావుడు జయశంకర్ సార్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాడూరి మాదవచారి, ఉపేంద్రచారి, ఆరుద్ర వెంకటేశ్వర్లు, ఆకారపు వెంకటేశ్వర్లు, రామారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ సార్ 8వ వర్ధంతిని తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జనసమితి జిల్లా నాయకుడు లింగాల కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నలంద కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్, మనోజ్, కృష్ణారావు, శంకర్, శ్రీపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని ట్వింకిల్‌స్టార్ హైస్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ వీఎస్ పాణి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికి స్ఫూర్తి ప్రదాత జయశంకర్‌సార్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో దాసరి ప్రసాద్, ఉపాద్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles