ఇంట్లో 21 పాముపిల్లలు...

Sat,June 22, 2019 02:15 AM

కేసముద్రం రూరల్, జూన్21: రాంజీనాయక్ ఇంటిలో 21 పాము పిల్లలు బయటపడటంతో వాటిని చంపివేసిన సంఘటన మండలంలోని మహామూద్‌పట్నం శివారు మూలస్తంభంతండాలో శుక్రవారం చోటు చేసుకుంది. బాధితుడు రావంజీనాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రోజు వర్షం రాత్రి కురవడంతో తండాకు చెందిన గుగులోత్ రాంజీనాయక్, భార్య కవితలు ఇంట్లో నిద్రించారు. ఈక్రమంలో 2 గంటల రాత్రి బయటకు రాగా రెండు పాముపిల్లలు కనిపించాయి. భయంతో భర్త రాంజీని కవిత లేపింది. దీంతో రాంజీ పాము పిల్లలను చంపివేశాడు. ఇంకా ఉన్నాయేమో వెతుకగా మొత్తం 20 పాముపిల్లలు బయటపడ్డాయి. ఈక్రమంలో తెల్లవారుజామున ఉదయం 6 గంటల ప్రాంతంలో తల్లిపాము కవితను కాటు వేసింది. దీంతో పామును దొరకపట్టి చంపివేశారు. అనంతరం కవితను చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. పాముపిల్లలు రక్తపెంజర జాతికి చెందినవని, వాటి కాటు చాలా ప్రమాదంగా ఉంటుందని తెలిపారు. కాగా కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపినట్లు భర్త రాంజీనాయక్ తెలిపారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles