కుల బహిష్కరణతో మహిళ ఆత్మహత్యా యత్నం..

Wed,June 19, 2019 02:24 AM

బయ్యారం, జూన్‌ 18: శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది మానవుడు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్న తరుణంలో ఇంకా గిరిజన గ్రామాల్లో బానిసత్వం రాజ్యమేలుతోంది. గ్రామాల్లోని పెద్దలు పంచాయితీ నిర్వహించి ఓ కుటుంబానికి జరిమాన విధించటమే కాకుండాడబ్బులు చెల్లించే వరకు కులబహిష్కరణ చేశారు. దీంతో మానసిక వేదనకు గురైన ఆ కుటుంబంలోని మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన మండలం కొత్తగూడెంలో చోటు చేసుకుంది. బాధత కుటుంభం తెలిపిన వివరాల ప్రకారం.... మండలంలోని కొత్తగూడెం గ్రామానికి చెందిన ఈసాల ధనుంజయ పద్మల పెద్ద కుమారుడు నాగేశ్‌ మూడు సంవత్సరాల కింద అదే గ్రామానికి చెందిన ఓ అమ్మయిని ప్రేమించాడు.

ఈ నేపథ్యంలో అమ్మయి తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయటంతో నాగేశ్‌తో పాటు తల్లిదండ్రులు జైలుకు వెళ్లి బేయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం గ్రామంలో పంచాయతీ నిర్వహించిన పెద్దలు నాలుగు లక్షల జరిమాన అమ్మాయి తల్లిదండ్రులకు చెల్లించాలని తీర్మానం చేస్తారు. అంతేకాకుండా డబ్బులు చెల్లించే వరకు వారి ఇంటికి ఎవ్వరూ వెళ్లకూడదని, మాట్లాడకూడదని గ్రామంలోని వారికి షరతులు విధించారు. అనంతరం నాగేశ్‌ వివాహం మరో అమ్మయితో జరిగింది. ఇటీవల ధనుంజయ చిన్న కొడుకు వివాహం సమయంలోనూ ఆంక్షలు పెట్టారని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ధనుంజయ ఇంటికి ఐదుగురు పెద్ద మనుషులు వచ్చి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేయటంతో మనస్తాపానికి గురైన పద్మ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెను మానుకోట దవాఖానకు, పరిస్థితి విషయంగా ఉండటంతో వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అయితే కుల బహిష్కరణ విషయంపై ఎస్సై మురళీధర్‌ను వివరణ కోరగా కుల బహిష్కరణ అంశం తమ దృషికి రాలేదని తెలిపారు.

88
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles