టీటీడీలో గెస్ట్‌ ఉపాధ్యాయుల కోసం ఇంటర్వ్యూలు

Wed,June 19, 2019 02:24 AM

కాజీపేట, జూన్‌ 18: కాజీపేట పట్టణం ప్రగతినగర్‌ ఫేస్‌-2లో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వెంకటేశ్వర బధిరుల ఉన్నత పాఠశాలలో (2019-20) విద్యా సంవత్సరంలో గెస్ట్‌ ఉపాధ్యాయులుగా పని చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జే లక్ష్మీనర్సమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు పండిత్‌ గ్రేడ్‌-2, స్పీచ్‌ థెరపిస్ట్‌ టెక్నీషియన్‌ (స్వీచ్‌ అండ్‌ హియరింగ్‌) తదితర సబ్జెక్టులలో బోధించేందుకు సెకండ్‌ గ్రేడ్‌ గెస్ట్‌ ఉపాధ్యాయులను తాత్కాలిక ప్రాతిపాధికన తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ నెల 28న ఉదయం 10 గంటలకు ఈ పాఠశాలలో వీరికి వాక్‌-ఇన్‌- ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ఆసిక్తి కలిగిన అభ్యర్థులు ప్రభుత్వ ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు విద్యార్హతలు కలిగి ఉండి, వయస్సు, నివాసం, కులము, ప్రావీణ్యం,ధ్రుృవీకరణ పత్రాలు ఒర్జినల్‌ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌ కాపీలతో వాక్‌-ఇన్‌- ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు. పూర్తి సమాచారం కోసం పాఠశాల ఫోన్‌ నంబర్‌ 0870-2459374, 0870-2959423లో సంప్రదించాలని కోరారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles