నేరాల ఛేదనే లక్ష్యంగా ముందుకు సాగాలి

Wed,June 19, 2019 02:24 AM

-ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
-పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం
మహబూబాబాద్‌, నమస్తే తెలంగాణ, జూన్‌ 18: జిల్లాలో నేరాల ఛేదనే లక్ష్యంగా, శాంత్రి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని టౌన్‌ పోలీసు స్టేషన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో తొర్రూరు సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారులతో మంగళవా రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్‌ కేసులు వెనువెంటనే ఛేదించాలని, నేరస్తులకు తక్కువ సమయంలో చట్టప్రకారం శిక్ష పడేలా విచారణ చేపట్టాలన్నారు. మోడ్రన్‌ పోలీసింగ్‌, నేర నియంత్రణలో భాగం గా జిల్లాలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలున్నాయి, వాటి స్థితి గతులను అడిగి తెలుసుకున్నారు. ఆన్‌లైన్‌లో కేసులకు సంబంధించి పెండిం గ్‌ లేకుండా చూడాలని, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు. ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో తప్పనిసరిగా ఫైవ్‌ఎస్‌లను తప్పక పాటించాలన్నారు. ఈ నియమాలు పాటిస్తున్నారో లేదా ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పెండింగ్‌ కేసులపై పోలీసు అధికారుల సందేహాలను నివృతి చేశారు. సమావేశంలో డీఎస్పీ మందన్‌లాల్‌, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ తిరుపతి, డీసీఆర్‌బీ సీఐ రమేశ్‌, తొర్రూరు సీఐ చేరాలు, మరిపెడ సీఐ కరుణాకర్‌, ఎస్సైలు పాల్గొన్నారు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles