కరంట్‌ కష్టాలకు సీఎం చెక్‌

Tue,June 18, 2019 01:39 AM

-ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌
- ఉల్లెపల్లిలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ప్రారంభం
మరిపెడ, నమస్తేతెలంగాణ, జూన్‌ 17 : స్వరాష్ట్రంలో రైతన్నలకు, గృహ వినియోగదారులకు కరంట్‌ కష్టాలు తీరాయని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ అన్నారు. సోమవారం మండలంలోని ఉల్లెపల్లిలో దీన్‌దయాళ్‌ పథకం కింద నూతనంగా రూ.1.42కోట్లతో ఏర్పాటు చేసిన 33/11కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు, రైతులు కరంట్‌ కోసం అరిగోస పడ్డారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌తోనే కరంట్‌ కష్టాలు తీరయన్నారు. ఒక్క డోర్నకల్‌ నియోజకవర్గంలోనే రాష్ట్రంలో దరిదాపు ఎక్కడ లేని విధంగా ఈ నియోజకవర్గంలోని పెద్దనాగారం, అయ్యగారిపల్లి, డోర్నకల్‌లో 132/33కేవీ వి ద్యుత్‌ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేసి వాటికింద 29 సబ్‌స్టేషన్లను నిర్మించినట్లు తెలిపారు. దీం తో నియోజకవర్గంలోని మూడూళ్లకు ఓ సబ్‌స్టేషన్‌ ఉందన్నారు. ప్రతీ సబ్‌స్టేషన్‌ కింద ప్రత్యేక ఫీడర్లను, బ్రేకర్లను ఏర్పాటు చేసి కరంట్‌ ఇబ్బందులను తీర్చడం జరిగిందన్నారు.

కరంట్‌ లెక్కనే సాగు నీళ్లు తెస్తా..
ఇప్పుడు ఎైట్లెతే వద్దంటే కరంట్‌ వస్తుందో.. వచ్చే దసరా దీపావళి నుంచి కూడా కరంట్‌ లెక్కనే ఊరూరికి సాగు నీళ్లు తీసుకొచ్చి చెరువులు, కుంటలను నింపుతామని డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యా మరోమారు స్పష్టం చేశారు. కాల్వల రిపేరు కోసమే రూ.200కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కాల్వల మరమ్మతు పనులు జరుగుతున్నట్లు చెప్పారు. ఉల్లెపల్లి గ్రామం పాలకుండలాంటి గ్రామమని మెచ్చుకున్నారు. ప్రతి ఎలక్షన్‌లో ఈ ఊరి నుంచి టీఆర్‌ఎస్‌కు మెజార్టీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నవీన్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎన్‌ గుట్టా, డీఈఈలు సామ్యానాయక్‌, శ్రీధరాచారి, ఏడీఈఈలు కిశోర్‌కుమార్‌, నర్సింహారావు, ఏఈఈలు పాండునాయక్‌, రమేశ్‌, జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డీఎస్‌ రవిచంద్ర, మానుకోట ఏఎంసీ మాజీ చైర్మన్‌ ఆర్‌ సత్యనారాయణరెడ్డి, ఎంపీపీలు తాళ్లపెల్లి రాణిశ్రీనివాస్‌, గుగులోత్‌ అరుణరాంబాబు, జెడ్పీటీసీలు భాల్ని మాణిక్యం, తేజవత్‌ శారదరవీందర్‌నాయక్‌, మాజీ ఎంపీపీ గుగులోత్‌ వెంకన్న, మరిపెడ మాజీ సర్పంచ్‌ రాంలాల్‌, ఓడీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ కే మహేందర్‌రెడ్డి, ఉల్లెపల్లి, భూక్యాతండా, లూనవత్‌తండా సర్పంచ్‌లు ప్రభాకర్‌, సేవ్యానాయక్‌, వీరమల్లు, ఉల్లెపల్లి ఎంపీటీసీ బాలాజీ, భూక్యా జ్యోతి పాల్గొన్నారు.

రూ.125కే గృహ కనెక్షన్‌..
రూ.125కే గృహ విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తున్నామని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎన్‌ గుట్టా అన్నారు. ఉల్లెపల్లి సబ్‌స్టేషన్‌ ప్రారంభానికి ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం 24గంటల నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తోందని గుర్తు చేశారు. మరోవైపు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ నవీన్‌ మాట్లాడుతూ.. ఉల్లెపల్లి సబ్‌స్టేషన్‌ ఏర్పాటు ఈ ప్రాంత ప్రజలకు, రైతులకు ఓ వరమని అన్నారు. అలాగే టీఆర్‌ఎస్‌ యువ నేత డీఎస్‌ రవిచంద్ర మాట్లాడుతూ.. రైతు బిడ్డగా రైతు పడే ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ రెడ్యానాయక్‌ ఈ ప్రాంత రైతుల కోసం పరి తపిస్తున్నట్లు తెలిపారు. ఆకేరు, పాలేరు, మున్నేరు నదులపై చెక్‌ డ్యాంలను నిర్మించి వరి సేద్యానికి ఎంతో ఉపకరించినట్లు చెప్పారు. అదేవిధంగా ప్రతి మూడూళ్లకు ఓ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేసిన ఘనత రెడ్యాకే దక్కుతుందన్నారు.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles