‘మంత్రిగా మంచి పేరు సంపాదిస్తా’

Tue,June 18, 2019 01:38 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ: పూర్వపు వరంగల్‌ జిల్లా చరిత్రలో ఎవరికి రాని మంత్రి పదవులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాకు ఇచ్చాడు. మీ ఆశీర్వాదంతోనే గెలిస్తేనే ఈ పదవి వచ్చింది. మంచి పేరు తెచ్చుకుని కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు గర్వపడేలా వ్యవహరిస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. తొర్రూరు డివిజన్‌ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం గుర్తూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ వార్డు సభ్యులతో పాటు ఆ పార్టీ ప్రధాన కార్యకర్తలు గ్రామ సర్పంచ్‌ మోత్కురి రవీంద్రాచారి నాయకత్వంలో మంత్రి దయాకర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్‌కు చెందిన ఉప సర్పంచ్‌ అవుల సుజాతరవి, వార్డు సభ్యులు పెంట సుధాకర్‌, వడ్లకొండ సుధాకర్‌, ఉమ్మగాని ఎల్లగౌడ్‌, జీ లక్ష్మివెంకన్న, ఉమ్మగాని శ్రీను, పంజాల అశోక్‌, కూతురు మన్‌మోహన్‌రెడ్డి, రాజేశ్‌, బుచ్చిరాములు, భిక్షపతితో పాటు 150 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్‌, గ్రామ ఇన్‌చార్జులు తమ్మెర వీరభద్రరావు, జలకం శ్రీనివాస్‌, ఎంపీటీసీ మేరుగు మాధవిరమేశ్‌, ఇసంపల్లి బాలకృ ష్ణ, దేవరకొండ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

69
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles