‘ప్రజాసంక్షేమమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం’

Tue,June 18, 2019 01:38 AM

కొడకండ్ల, జూన్‌ 17: సీఎం కేసీఆర్‌ ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. సోమవారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, రీఅసైన్డ్‌ భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకం ప్రవేశపెట్టి ఆడబిడ్డలకు మేనమామగా నిలిచారన్నారు. పేదలకు పంపిణీ చేసిన భూములను ఆర్థిక బాధలతో అమ్ముకుంటే కొనుగోలు చేసిన వారు పేదవారైతే వారికి రీఅసైన్డ్‌ భూముల పట్టాలను అందజేస్తున్నది సీఎం కేసీఆరేనని ఆయన తెలిపారు. మండలంలో పీవోటీ పట్టాలను 191 మంది లబ్ధిదారులకు 250 ఎకరాల పట్టాలను అందజేశారు. అలాగే కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేశ్‌, తహసీల్దార్‌ ఎం ఎహమ్మద్‌, ఎంపీడీవో డాక్టర్‌ రమేశ్‌,రాష్ట్ర గిరిజన సహకార సంఘం చైర్మన్‌ గాంధీనాయక్‌, జెడ్పీటీసీ లలి త,సర్పంచ్‌ల ఫోరం సంఘం అద్యక్షుడు మధుసూదన్‌, తాజా ఎంపీపీ జ్యోతి, తాజా జెడ్పీటీసీ సత్తమ్మ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles