ఆడపిల్ల భారం కాదు.. ఓ వరం..

Tue,June 18, 2019 01:38 AM

-పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి దయాకర్‌రావు
-రైతులకు 757పట్టాదార్‌పాసుపుస్తకాలు, 81కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
-వర్షంలోనే మాట్లాడిన మంత్రి
పెద్దవంగర: ఆడపిల్ల పుడితే తల్లిదండ్రులకు భారంగా ఉండేదని, సీఎం కేసీఆర్‌ పాలనలో ఇప్పుడు భారం కాదని.. ఆడపిల్ల ఓ వరమని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం కింద మంజూరైన రూ.75.87లక్షల విలువైన 81చెక్కులను, 757 రైతు పట్టాదార్‌ పాసుపుస్తకాలను పంపిణీచేసి మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే 6లక్షల18వేల మంది రైతులకు పట్టాదార్‌ పాసుపుస్తకాలు అం దించామన్నారు. నియోజకవర్గంలో ఇల్లులేని నిరుపేదకు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు అందించడం జరుగుతుందన్నారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.1లక్ష116 నగదు, ఆడపిల్లలు జన్మనించిన తర్వాత మొ త్తం ఆరు నెలలకు రూ.12వేలు అందిస్తోందన్నారు.

రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు
పట్టాదార్‌ పాసుపుస్తకాల పంపిణీలో రైతన్నలను ఇబ్బందులకు గురి చేయవద్దని, పెద్దవంగర మండలంలో గతంలో అవినీతికి పాల్పడిన కొందరు రెవెన్యూ అధికారులను సస్పెండ్‌ చేశానని, అలాంటి అక్రమాలకు పాల్పడినట్లు తెలిస్తే ఎంతటి వారినైన సహించేది లేదన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పాసు పుస్తకాలను అందించాలని, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే వెతలను తప్పించే ఏర్పాట్లు సీఎం చేస్తున్నారన్నారు. రెవెన్యూ అధికారుల పనితీరుపై ప్రజలు మంత్రికి ఫిర్యాదు చేయడంతో అధికారులపై మంత్రి మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఈశ్వరయ్య, తహసీల్దార్‌ రవికుమార్‌, డీపీఆర్వో అయ్యూబ్‌ఆలీ, ఎంపీపీలు జ్యోతి, రాజేశ్వరి, జెడ్పీటీసీలు కమలాకర్‌, జ్యోతిర్మయి, మండల కో ఆప్షన్‌ ముజీబుద్ధీన్‌, వైస్‌ ఎంపీపీ కల్పన, పాలకుర్తి దేవస్థాన చైర్మన్‌ రామచంద్రయ్యశర్మ, రైతు సమన్వయ సమితి జిల్లా నాయకులు నెహ్రునాయక్‌, రైతు సేవాసహకార సంఘ వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, మండల రైతు సమన్వయ సమితి కన్వీనర్‌ సోమారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు ఐలయ్య, మాజీ జెడ్పీటీసీ వెంకటయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు మనోహర్‌, విజయ్‌పాల్‌రెడ్డి, సుధీర్‌, సంజయ్‌, మనోహర్‌, లింగమూర్తి, సుధాకర్‌, రాము, చంద్రశేఖర్‌నాయక్‌, గోపాల్‌రెడ్డి, వెంక న్న, ఆంజనేయులు, రాసాల సమ్మయ్యయాదవ్‌, యాకయ్య, అశోక్‌, నారాయణరెడ్డి, జ్ఞానేశ్వరచారి, మల్లికార్జునచారి, ఉపేందర్‌రెడ్డి, సమ్మ య్య, రాజుయాదవ్‌, టీఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులు హరీశ్‌, వేణుసాగర్‌, యాకన్న, రామ్మూర్తి, వెంకటేశ్‌, అనుదీప్‌, వివిధ గ్రామాల సర్పం చ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles